దేవర @ 100 డేస్.. సరికొత్త రికార్డ్ దుమ్ము రేపుతున్న ఎన్టీఆర్..

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర.. గ‌తేడాది ద‌స‌రాకు రిలీజై బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫ‌స్ట్ షోతోనే నెగిటివ్ టాక్‌ సంపాదించుకున్న ఈ మూవీ మెల్లమెల్లగా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్ల పరంగా పుంజుకుంటూ రికార్డులు సృష్టించింది. ఇక ఈ సినిమా సృష్టించిన సంచలనాలు అన్ని.. ఇన్ని.. కాదు. అన్నింటికంటే పెద్ద సంచలనం ఏంటంటే రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్.. ఎన్టీఆర్ బ్రేక్ చేయడం. రాజమౌళి దర్శకత్వంలో తెర‌కెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్.. నెక్స్ట్ రాబోయే సినిమాకు ప్లాప్ సెంటిమెంట్ వెంటాడుతుందంటూ ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి.

NTR Jr.'s 'Devara: Part 1' creates box-office record even before release.  Trailer date announced - The Economic Times

రాజమౌళి డైరెక్షన్లో సినిమా నటించి బ్లాక్ బ‌స్టర్ అయిన తర్వాత.. ఆ సినిమాలో హీరోలు కచ్చితంగా తర్వాత సినిమాతో ఫ్లాప్ ఎదుర్కొంటూ వచ్చారు. అలా ఎన్టీఆర్ దేవర కూడా ఫ్లాప్ అవడం ఖాయం అంటూ ఎన్నో రకాలుగా వార్తలు వినిపించాయి. అయితే దేవ‌ర‌తో బ్లాక్ బస్టర్ కొట్టి ఆ బ్యాడ్ సెంటిమెంట్ ను బ్లాస్ట్ చేశాడు ఎన్టీఆర్. అయితే.. తాజాగా దేవరతో ఎన్టీఆర్ ఖాతాలో మరో సరికొత్త రికార్డు చేరింది. ఈ సినిమా ఇప్పటివరకు 6 కేంద్రాల్లో 100 రోజులు ఆడి సంచలనం సృష్టించింది. సెప్టెంబర్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా ఈస్ట్, గుంటూరు, చిత్తూరు ఇలా కొన్ని ఏరియాలలో 100 డేస్ ఆడిన సినిమాగా రికార్డ్‌ క్రియేట్ చేసింది.

Jr NTR's Devara Part 1 Preponed! Here's The Film's New Release Date | Times  Now

ఈస్ట్‌లో మల్కిపురం పద్మజా కాంప్లెక్స్, మండపేట – రాజరత్న కాంప్లెక్స్ లో వంద రోజులు ఆడిన సినిమా.. గుంటూరులో.. రామకృష్ణ – సిహెచ్ పేటలో 100 రోజులు ఆడింది. చిత్తూరు.. బి.కొత్తకోట – ద్వారక పిక్చర్ ప్యాలెస్ , కల్లూరు – ఎమ్ఎన్ఆర్‌ థియేటర్లో, రొంపిచర్ల.. ఎం ఎం డ్యూ లక్స్ థియేటర్‌లోను వంద రోజులు ఆడి సంచలనం సృష్టించింది. ఇక ఇటీవల పాన్ ఇండియాలెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమాను ఏవీ ఇలాంటి రికార్డును క్రియేట్ చేయలేదు. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరోసారి ఆనందని వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ రాబోయే సినిమాలతో మరిన్ని సక్సెస్లో అందుకోవాలని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.