టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఎమోషనల్ కంటెంట్‌తో పాటు.. కామెడీ ఎంటర్టైనర్‌ను జోడించి రూపొందించిన ఈ సినిమా సంక్రాంతి పండుగ బరిలో సంక్రాంతి నాడే రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయ్యారు. అయితే.. ఈ మూవీలో బుల్లి రాజు అనే క్యారెక్టర్‌లో ఓ బాబు నటించిన సంగతి తెలిసిందే. బుల్లి రాజు క్యారెక్టర్ సినిమాకి హైలెట్గా నిలవడంతో.. బాబుకు క్రేజి పాపులారిటీ వచ్చింది.
ఇక ఈ బుల్లిరాజు అసలు పేరు రేవంత్ సుభాష్. ఏలూరు జిల్లా నిడమర్రు మండలం.. చానామిల్లికి చెందిన భీమల శ్రీనివాసరావు, దేవి దంపతులకు తనయుడు. రేవంత్ బుల్లి రాజుగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేన తరఫున ప్రచారం చేస్తూ ఓ వీడియాను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో.. ఆ వీడియో కాస్త వైరల్‌గా మారి.. రేవంత్‌కి సినిమాలో అవకాశం దక్కింది. అయితే.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బాల నటుడిగా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న బుల్లి రాజుకు తాజాగా మరో స్టార్ హీరో సినిమాలో ఆఫర్ వచ్చిందంటూ జాక్పాట్ కొట్టడంటు న్యూస్ వైరల్ గా మారుతుంది.
ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబు సినిమాలో కూడా బుల్లి రాజుకు చాన్స్ ఇవ్వాలని అనిల్ రావిపూడి భావిస్తున్నాడట. రాజమౌళితో మహేష్ ప్రస్తుతం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత మహేష్.. అనిల్ రావిపూడితో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అందులో బుల్లి రాజుకు చాన్స్ ఇవ్వాలనే ఆలోచనలో అనిల్ ఉన్నాడట. ముఖ్యంగా బుల్లి రాజుతో అనిల్ రావిపూడి చాలా క్లోజ్ అయిపోయారు. ఈ క్రమంలోనే షూటింగ్ జరిగేటప్పుడు సమయం దొరికినప్పుడల్లా బుల్లి రాజుతో ఆడుకునేవాడట. ఈ విషయాన్ని స్వయంగా బుల్లి రాజు ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. ప్రస్తుతం బుల్లి రాజు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారిపోయాడు. ఈ క్రమంలోనే మరిన్ని సినిమాల్లో ఆఫర్స్ రావడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.