జనవరి 10 ఈ డేట్ మెగా అభిమానులకు, మెగా హీరోలకు ఒక బ్యాట్ సెంటిమెంట్ గా మారిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. మెగ హిరోల కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ఈ తేదీన రిలీజ్ చేసినా సినిమాలు అన్ని మెగా హీరోలకు ఘోరమైన డిజాస్టర్లు, ఫ్లాప్ గానే నిలుస్తూ వచ్చాయి. ఇప్పుడు ఈ డేట్ అభిమానులకు ఓ పీడకలగా మారిపోయింది. జనవరి 10 తేదీ చెప్తే వణికిపోయే స్టేజ్‌కు వచ్చేసారు. ఇప్పటివరకు అలా జనవరి 10న రిలీజై బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా గెలిచిన మెగా హీరోల సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మృగరాజు. ఈ సినిమా అప్పట్లో డిజాస్టర్ గా నిలిచింది. అయితే చిరుకి ఈ సినిమాకు ముందు కూడా వరుస ఫ్లాప్‌లు ఉన్నాయి.
అయితే చిరు కెరీర్‌లోనే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన చూడాలని ఉంది సినిమా డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో.. మృగరాజు మూవీ తెరకెక్కడంతో ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. కానీ.. సినిమా అంచనాలకు తగ్గట్టు రాకపోవడంతో కనీస స్థాయిలో కూడా కలెక్షన్లు రాబట్ట లేకపోయింది. ఫలితంగా మెగా ఫ్యాన్స్‌కు ఎప్పటికీ మర్చిపోలేని డిజాస్టర్‌గా సినిమా మిగిలిపోయింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అజ్ఞాతవాసి కూడా అదే తేదీన రిలీజై డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. పవన్ ఈ సినిమాతో చాలా కాలం పాటు నటనకు గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సినిమాకు కూడా జల్సా, అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్.. ఇండస్ట్రియల్ హిట్‌లు అందించినన త్రివిక్రమ్ దర్శకత్వం వహించడంతో.. ఈ కాంబోపై కూడా ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా పేరు చెబితే గూస్ బంప్స్‌తో ఊగిపోయేవారు ఆడియన్స్. అలా భారీ అంచనాలతో రిలీజ్ అయిన సినిమా.. ఘోరమైన డిజాస్టర్ గా నిలిచింది. సినిమా రిలీజ్ అయిన రోజే చూసిన ఆడియన్స్ పెద్దవి విరుస్తూ నెగిటివ్ కామెంట్స్ చేశారంటే సినిమా ఏ రేంజ్ లో డిజాస్టర్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్. ఇది కూడా జనవరి 10న రిలీజ్ అయింది. ఇక ప్రస్తుతం ఈ సినిమా రిజల్ట్ చూస్తూనే ఉన్నాం. ఈ సినిమా రిలీజ్ కి ముందు ఆ బ్యాడ్ సెంటిమెంట్ ను చరణ్ బ్రేక్ చేయగలడని అభిమానులు నమ్మారు. కానీ.. ఆ బ్యాడ్ సెంటిమెంట్ ని ఎంత పెద్ద కాంబినేషన్ అయినా బ్రేక్ చేయలేదని ప్రూవ్ అయింది. మొదటి షో నుంచే నెగటివ్ టాక్ రావడంతో.. గేమ్ ఛేంజర్‌కు మెల్లమెల్లగా కలెక్షన్లు తగ్గుతూ వచ్చాయి. ఈ సినిమా మృగరాజు, అజ్ఞాతవాసి రేంజ్ ఫ్లాప్ అని చెప్పకున్నా.. సినిమాపై మాత్రం నెగెటివిటీ వచ్చింది. అయితే మూడు రోజుల్లోనే సినిమా రూ.150 కోట్లు కలెక్షన్లు సాధించడం విశేషం.