కొలీవుడ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా.. తమిళ్ డైరెక్టర్ విడుదల పార్ట్ 2 తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మంజూ వారియర్స్ హీరోయిన్గా.. సూరి ప్రథమ పాత్రలో నటించిన ఈ సినిమా.. విడుదల సినిమాకు సీక్వెల్‌గా రూపొందించడంతో.. సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక నేడు.. తెలుగు, తమిళ్ రెండు భాషలలోను విడుదల పార్ట్ 2 గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేశారు మేకర్స్. సినిమా ఎలా ఉంది.. విజయ్ సేతుపతి నటన ఆకట్టుకుందా.. లేదా.. రివ్యూ లో చూద్దాం.
స్టోరీ:
గతేడాది రిలీజ్ అయిన విడుదలకు కొనసాగింపుగా కథ మొదలైంది. పెరుమాళ్(వజయ్) కొమరేష్ (సూరి) ఇచ్చిన ఆధారాలతో పోలీసులు అరెస్ట్ చేస్తారు. అసలు కథ నడుస్తున్న క్రమంలోనే.. ఫ్లాష్ బ్యాక్ మధ్యలో చూపిస్తారు. తను పని చేసే ఫ్యాక్టరీ యజమాని కూతురు.. మంజు వారియర్. పరిమాళ్తో గతంలో ప్రేమాయణం నడుపుతుంది. ఆమె అభ్యుదయ భావాలు ఉన్న వ్యక్తి కావడంతో.. పెరుమాళ్ కు దగ్గర అవుతుంది. కొన్నాళ్లు పెరుమాళ్ టీచర్ గా పనిచేస్తాడు. వెనుకబడిన బడుగు వర్గాల పిల్లలకు చదువు చెబుతూ ఉంటాడు. వారి వైపు సపోర్టుగా ఉంటూ.. కుల వివక్ష చూపిస్తూ టార్చర్ చేసే జమీందారులతో పోరాడుతాడు. ఇందులో భాగంగానే ఒక తిరుగుబాటుదారుడిగా మారి పోలీసులకు శత్రువు అవుతాడు. ఈ క్రమంలోనే పోలీసులు అతని అరెస్ట్ చేశారు. అక్కడ నుంచి ఏమవుతుంది అనేది మిగతా కథ.
విశ్లేషణ:
ఇక విడుదల మొదటి భాగం కమరేసన్ జర్నీ, లవ్ స్టోరీ, పెరమాళ్ని పట్టుకునేందుకు ఆయన చూపించిన ధైర్య సాహసాలు చూపించగా.. రెండో భాగం పూర్తిగా పెరమాళ్ జర్నీ మెయిన్ లీడ్‌గా సాగుతుంది. ఆయన ప్రజాదళ నాయకుడిగా మారిన తీరు.. మారడానికి దారి తీసిన పరిస్థితులు, జమీందారుల ఆగడాల్లు.. ఇవన్నీ తెరపై అతికినట్లు చూపించారు. మరోవైపు కమ్యూనిస్టు ఉద్యమాలు ఎలా ఉంటాయి. వాళ్ళ ఆలోచనలు పంథా ఎలా ఉంటుంది.. సిద్ధాంతాలు ఏమి చెబుతున్నాయి.. అనేదానిపై కూడా దర్శకుడు చూపించాడు. పేదలను, బలమీన వర్గాల ప్రజలను పోలీసులు, ప్రభుత్వాలు ఎలా బలి చేస్తున్నారు.. ఎలా వాడుకుంటున్నారు.. అనేదాన్ని దర్శకుడు చాలా క్రియేటివ్ గా చూపించాడు.
స్టార్టింగ్ ఎపిసోడ్లు, క్లైమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇక సినిమాలో మంజు వారియర్స్, సేతుపతి మధ్యన లవ్ ట్రాక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇలాంటి సీరియస్ ఫిలిం లోని కామెడీ ఎలిమెంట్స్ మెప్పిస్తాయి. ఈ జనరేషన్ వారికి కమర్షియల్ ఫార్మాట్లో చూసేవాళ్ళకు ఈ సినిమా ఎంతవరకు అర్థమవుతుందనేదే సందేహం. ఈ సినిమాలో వాడిన పథజాలం, కమ్యూనిస్టు సిద్ధాంతాలు ఇప్పటి జనరేషన్ కు కనెక్ట్ అవడం కష్టమే. అంతేకాదు సినిమాలో ఫన్, ట్విస్ట లు ఉన్న కూడా సినిమా చాలా స్లోగా అనిపిస్తుంది. దీనితో సినిమా పై ఆసక్తి తగ్గుతుంది. అయితే ఇప్పటి తరానికి అప్పటి పరిస్థితులు కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నంలో విట్రీ మారన్ సక్సెస్ అయ్యాడు. రియాలిటీ కి దగ్గరగా చూపించిన తీరు ఆకట్టుకుంటుంది.
ఇక సినిమాలో విజయ్ సేతుపతి నటన వేరే లెవెల్. ఇలాంటి రా రోల్లో విజయ రెచ్చిపోతారన్న సంగతి తెలిసిందే. మరోసారి తన నట విశ్వరూపం చూపించాడు. మంజు వారియర్ తో సాగే లవ్ సీన్స్ లో తన నటన ఆకట్టుకుంటుంది. సినిమాకు వన్ మ్యాన్‌షో అనడంలో సందేహం లేదు. ఇక మహాలక్ష్మి గా మంజు వారియర్స్ నటన మెప్పించింది. కుమరేశం గా సూరి పాత్ర పరిధి కాస్త తగినా.. పరిధి మేరకు తన నటనతో మెప్పించారు. ఇక కమ్యూనిస్టు ముఖ్యమైన నాయకుడు కేకేగా కిషోర్ పాజిటివ్ రోల్ తో ఆకట్టుకున్నాడు. డిఎస్పీగా గౌతం వాసుదేవ్ తన మార్క్ నటనతో మెప్పించాడు. సినిమాలో దాదాపు అందరూ నటులు తమ పాత్ర పరిమితిమేరకు ఆకట్టుకున్నారు. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇలాంటి రా కంటేంట్ సినిమాను తీసి తన ప్రత్యేకతను చాటుకున్నాడు డైరెక్టర్. సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. టెక్నికల్ గా సినిమా మెప్పిస్తుంది.
రేటింగ్ :3/5