డీసెంట్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ఉపేంద్ర యూఐ.. బాక్సాఫీ దగ్గర గట్టిగానే కొల్లగొట్టాడుగా..!

సౌత్ స్టార్ హీరో రియల్ స్టార్ ఉపేంద్ర హీరోగా నటించి దర్శకత్వం వహించినం యూఐ ది సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది .. సైకలాజికల్ బ్యాక్ డ్రాప్ లో ఉపేంద్ర ఈ మూవీని తెర్కక్కించాడు. దీంతో ఈ సినిమాపై అభిమానులో అంచనాలు ఏం మాత్రం తప్పకుండా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో రవిశంకర్ , రేష్మ , అచ్యుత్ కుమార్ , నీతూ వనజాక్షి వంటి వారు ప్రధాన పాత్రలో నటించారు. అయితే తాజాగా ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న‌ సమాచారం ప్రకారం యూఐ సినిమా రిలీజ్ అయిన తొలి రోజు డీసెంట్ కలెక్షన్లు రాబట్టినట్టు తెలుస్తుంది .. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు దాదాపు 6.5 కోట్లు కలెక్షన్ రాబెట్టిందట ..

ఇక ఇందులో కనడాలోనే అత్యధికంగా రూ.6 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టింది. ఇక తెలుగులో 70 లక్షలు , తమిళ్లో 4 లక్షలు , హిందీలో 1. 25 లక్షలు రాబట్టింది . నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా తొలి షో నుంచి పాజిటివ్ టాక్ రావటంతో .. మిగిలిన షోకి ఆడియన్స్ క్యూ కట్టారు .. ఇక దీంతో కలెక్షన్లు కూడా బాగానే పెరిగాయి .. ప్రస్తుతం పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్ సెలవులు ఉండటంతో శని , ఆదివారాల్లో దాదాపు ఈ సినిమా 50 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే సత్య (ఉపేంద్ర) మూవీ డైరెక్టర్ గా పని చేస్తూ ఉంటాడు. సత్యకి సమాజంలో జరుగుతున్న సంఘటన కారణంగా అంతర్గత సంఘర్షణలతో బాధపడుతూ ఉంటాడు ..

ఆ క్రమంలోనే తానే యూఐ సినిమా తీసి రిలీజ్‌ చేస్తాడు. ఈ సినిమా మీరు ఇంటిలిజెంట్ అయితే ఇప్పుడే ఈ సినిమా చూడకుండా బయటికి వెళ్ళొచ్చు మీరు పుల్స్ అయితే ఫుల్ సినిమా చూడండి అంటూ టైటిల్ కార్డ్స్ తో ప్రారంభం అవుతుంది. అయితే సిని విశ్లేషకుడు కిరణ ఆదర్శ్ (మురళీ శర్మ) యూఐ సినిమా చూడడానికి వెళ్లి అర్థం కాక రివ్యూ రాయడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు .. ఇక దాంతో యూఐ సినిమా దర్శకుడు సత్యాన్ని కలిసి మాట్లాడేందుకు వెళ్తాడు ఆ సమయంలోనే సినిమా గురించి షాకింగ్ నిజాలు తెలుసుకుంటాడు.. అసలు ఈ సినిమాలో కల్కి భగవాన్ ఎవరు ? సత్య స్టోరీ ఏంటి అనేది తెలియాలంటే ఈ సినిమా ధియేటర్లో చూడాల్సిందే.