ఇండస్ట్రీలో హేటర్స్ లేని టాలీవుడ్ హీరోలు వీళ్లే.. నిజంగా ఈ హీరోలు గ్రేట్.. !

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న వారికి అభిమానించే ఫ్యాన్స్ ఏ రేంజ్‌లో ఉంటారో.. వాళ్లను విమర్శించే హైట‌ర్స్‌ కూడా అదే స్థాయిలో ఉంటారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలోని కొంతమంది స్టార్ హీరోలు మాత్రం అసలు హేటర్స్ లేని హీరోస్‌గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. వారిలో ప్రధానంగా ముగ్గురు స్టార్ హీరోల పేర్లు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇంతకీ ఆ హీరోలు ఎవరో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం మనం చెప్పుకోబోతున్న ఈ ముగ్గురు స్టార్ హీరోలకు క్రేజ్‌, ఫాలోయింగ్, సక్సెస్ రేట్ రోజురోజుకు పెరుగుతుంది. వారిలో మొదటి వ్యక్తి సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్.

Mahesh, Venkatesh enjoying Poker - News - IndiaGlitz.com

మూడు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోగా కెరీర్‌ని కొనసాగిస్తున్నా.. ఇన్నాళ్ళ కెరియర్ లో ఒక్కసారి కూడా ఎలాంటి వివాదం లేకుండా.. మంచి పేరుతో రాణిస్తున్నారు. ఫ్యామిలీ సినిమాలకు ప్రాధాన్యతనిస్తూ ఎవరిని నొప్పించకుండా ఇండస్ట్రీలో ప‌నిచేస్తున్న వెంకీమామ‌ ఇతరులను నొప్పించేవిధంగా ఎప్పుడు కామెంట్లు చేయరు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆడియన్స్ను పలకరించనున్నాడు.హేటర్సే లేని స్టార్ హీరోలలో వెంకటేష్ తర్వాత వినిపించే పేర్లు మహేష్ బాబు. సినిమాల ప్రమోషన్స్ టైం లో మాత్రమే కెమెరా కళ్లకు చిక్కే మహేష్.. దాదాపు ఇండస్ట్రీలో ఉండే అందరు సెలబ్రిటీలతో స్నేహపూర్వకంగా మేలుగుతూ ఉంటాడు. ఇక.. దాదాపు ఏడాది నుంచి మహేష్ బాబు ఎలాంటి సినిమాల్లో నటించకుండా రాజమౌళి సినిమా మేకోవ‌ర్‌ కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

Police fines Prabhas' car for violating rules | INDToday

పాన్ వరల్డ్ రేంజ్‌లో రానున్న ఈ సినిమాతో.. భారీ బ్లాక్ బస్టర్స్ అందుకొని ఆయన మార్కెట్‌ను మరింతగా పెంచుకోవాలని ఫ్యాన్స్ ఆశ భావం వ్య‌క్తం చేస్తున్నారు. వీళ‌తోపాటు ఇండస్ట్రీలో హేట‌ర్స్ లేని మరో స్టార్ హీరో ప్రభాస్. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్న ప్రభాస్.. చేతినిండా సినిమాలతో బిజీ లైనప్‌ సెట్ చేసుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో భారీ సక్సెస్‌లు అందుకుంటున్న ప్రభాస్.. రోజురోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ రెట్టింపు చేసుకుంటున్నారు. అంతకంతకు ఈయన క్రేజ్ పెరుగుతూనే ఉంది. రాబోయే రోజుల్లో ప్లానింగ్ మరి రేంజ్ లో ఉండబోతుందో వేచి చూడాలి. ఇక త్వరలోనే ప్రభాస్ నుంచి రాజాసాబ‌ మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొన్నాయి.