ఆంధ్రాలో ” పుష్ప 2 ” ను అడ్డుకుంటాం.. జనసేన పొలిటిషన్ సెన్సేషనల్ కామెంట్స్..

పుష్ప 2 ఫీవర్ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న క్రమంలో.. అల్లు, మెగా ఫ్యామిలీ వార్‌ మరోసారి జోరందుకుంది. అల్లు అర్జున్.. మెగా ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పాలి. లేదంటే పుష్ప 2ను అడ్డుకుంటామంటూ జనసేన గన్నవరం నియోజకవర్గ నేత చలమల‌శెట్టి రమేష్ బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌లో జరిగిన సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్‌లో బన్నీ కనీసం మెగా ఫ్యామిలీ ప్రస్తావన తేకపోవడం జనసేన నేతలకు మరింత కోపం తెప్పించింది. ఈ క్ర‌మంలోనే జనసేన నేతలు, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ బన్నీపై ఫుల్ ఫైర్ అవుతున్నారు. తాజాగా చలమ‌ల‌శెట్టి రమేష్ మీడియా ముందు మాట్లాడుతూ అల్లు అర్జున్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ అల్లు, మెగా ఫ్యామిలీల మధ్యన వివాదాన్ని మరింత పెంచేసేలా ఉన్నాయి.

పుష్ప-2ని మా 40 ఊళ్లలో ఎలా రిలీజౌతుందో చూస్తా : అల్లు అర్జున్‌కి జనసేన నేత ఛాలెంజ్ | janasena leader chalamalasetty ramesh babu fires on icon star allu arjun over pushpa-2 release , here's ...

మెగా ఫ్యామిలీని యావత్ ప్రపంచం ఇష్టపడుతుంది. నువ్వు ఒక్కడివే ఒళ్ళు కొవ్వెక్కి వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావ్ అంటూ రమేష్ బాబు మండిపడ్డాడు. అల్లు అర్జున్ పోకడ మెగా ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ ను అభిమానించే జనసైనికులకు, జనసేన శ్రేణులకు కోపాన్ని తెప్పిస్తుందని వెల్లడించాడు. ఎన్నికల్లో ప్రాణాలు పణంగా పెట్టి పవన్ కళ్యాణ్.. వైసీపీని ఎదుర్కొంటుంటే అల్లు అర్జున్ మాత్రం మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఉండడానికి వైసీపీ తరఫున ప్రచారానికి వెళ్ళాడు అంటూ గుర్తు చేసిన ఆయన.. అల్లు అర్జున్ గతంలో తాము అల్టిమేటమ్ ఇచ్చామని.. కానీ బ‌న్నీ పోకడ మెగా ఫ్యామిలీకి, జనసైనికులకు చాలా బాధ కలిగించేలా ఉందని రమేష్ బాబు చెప్పుకొచ్చాడు.

మొదటి నుంచి మెగా ఫ్యామిలీ అభిమాని అని, తాను అక్కడే పెరిగానని, చిరంజీవి అడుగుజాడల్లో నడుస్తున్నానని మాట్లాడి.. ఇప్పుడు వారి ప్రస్తావన చేయకపోవడం సరికాదంటూ చెప్పిన రమేష్ బాబు.. మెగా ఫ్యామిలీని టచ్ చేస్తే ఏం జరుగుతుందో చూపిస్తామంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. తాము సైలెంట్‌గా ఉండలేమని.. ఇప్పటికైనా తన తప్పు తెలుసుకుని చిరంజీవి, పవన్, నాగబాబులకు క్షమాపణలు తెలియజేయాలని బన్నీకి వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పటికైనా మారకపోతే పుష్ప 2 సినిమా విడుదలను ఆంధ్రప్రదేశ్‌లో అడ్డుకోవడం ఖాయమని జనసైనికలతో పాటు.. మెగా ఫ్యాన్స్, అలాగే మిగతా ప్రజలు కూడా మాతో కలిసి ఈ సినిమాను అడ్డుకుంటారంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం చలమలశెట్టి రమేష్ బాబు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారడంతో.. పలువురు ఆయనను సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటే.. మరికొందరు బన్నీ అభిమానులు మాత్రం అతని కామెంట్స్ పై ఫైర్ అవుతున్నారు. ఏం చేసినా బన్నీ వెంట్రుక కూడా పీకలేరు అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.