ఎంతోకాలంగా.. బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. కాగా ఎట్టకేలకు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అనౌన్స్‌మెంట్ అయ్యింది. ప్రశాంత్ వర్మకు బాలయ్య ఈ అవకాశాన్ని ఇచ్చాడు. ప్రశాంత్ వర్మా డైరెక్షన్లో మోక్షజ్ఞ సినిమా రానుందని ఫ్యాన్స్ సంబరపడ్డారు. ఈ క్రమంలోనే ఆడియన్స్ కు సినిమాపై విపరితమైన అంచనాలు నెలకొన్నాయి. కాగా.. రీసెంట్గా సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెగ వైరల్‌గా మారుతుంది.
ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫేవరేట్ హీరోయిన్ నటించబోతుందంటూ న్యూస్ వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో చెప్పలేదు కదా.. తన్నే నాజూకు నడుం సుందరి ఇలియానా. ఇలియానా మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో.. కీ రోల్‌లో కనిపించనుందట. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ కావడంతో.. అంత ఆశ్చర్యపోతున్నారు. అయితే మొదట ప్రశాంత్ వర్మ ఈ సినిమాలో నెగటివ్ రోల్‌కు ఇలియానాను భావించినా.. తర్వాత బాలయ్య సజెషన్‌తో నెగిటివ్ పాత్ర కాకుండా.. సినిమాను టర్న్ చేసే ఓ పాత్ర కోసం ఇలియానాన్ని భావిస్తున్నారట.
ఇక ఇలియానా.. తెలుగు సినిమాలో నటించి చాలాకాలం అవుతున్న క్రమంలో.. మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో ఇలియానా నటిస్తుందని తెలియడంతో.. అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆమె రీఎంట్రీతో మరోసారి పూర్వ వైభవం రావాలని.. స్టార్ హీరోయిన్గా సక్సెస్ సాధించాలంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇలియానా ఇటీవల.. పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మరోసారి అవకాశాన్ని దక్కించుకొని హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.