బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8.. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఈరోజు ప్రారంభం కానుంది. అల్లు అర్జున్ స్పెషల్ గెస్ట్ గా హాజరు కానున్నట్టు సమాచారం. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ తెగ వైరల్ అవుతున్నాయి. అయితే బిగ్ బాస్ గత సీజన్‌ల రేంజ్ లో ఈ సీజన్ అయితే సక్సెస్ అందుకోలేకపోయింది. దానికి నాగార్జున హోస్టింగ్ కూడా ఒక కారణం అంటూ కామెంట్లు వినబడుతున్నాయి.
పాపం నాగ్ అనే స్టేజ్ కు వచ్చేసాడు. కంటెస్టెంట్స్ ఎంపిక విషయంలోనే ఎన్నో పొరపాట్లు జరిగాయని.. ఇదే షో అట్టర్ ప్లాప్ కావడానికి ప్రధాన కారణం అంటూ టాక్ నడుస్తుంది. బిగ్ బాస్ షో సీజన్ 8 రేటింగ్స్ కూడా విపరీతంగా పడిపోయాయి. ఇక నేడు జరగబోయే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కైనా భారీ రేటింగ్స్ వస్తే బాగుండని.. బిగ్‌బాస్ టీం భావిస్తున్నారట. ఇదిలా ఉంటే ఈ షో పై ఎంతో నెగిటివ్ ట్రోల్స్ మొదలయ్యాయి. నాగార్జున.. ఇక పై బిగ్ బాస్ హోస్టింగ్ మానేస్తే బాగుంటుందని.. అసలు తెలుగు వర్షన్ బిగ్ బాస్‌ను ఆపేయడం బెటర్ అని.. రకరకాలుగా కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.
కాగా ఈ సీజన్ కు నాగార్జున భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకున్నాడట. నిఖిల్ సీజన్ విన్నర్ అయ్యే అవకాశం ఉందని టాక్. ఇక ఈ షో ఫినాలే ఎపిసోడ్ తో అయినా.. గతంలోలా మంచి రెస్పాన్స్ అందుకుంటుందో లేదో వేచి చూడాలి. బిగ్‌బాస్ విన్నర్‌కు ప్రైజ్ మనీతో పాటు కొన్ని బెనిఫిట్స్ వస్తాయి అన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో విన్నర్ కు ఎలాంటి బెనిఫిట్స్ లభిస్తాయో వేచి చూడాలి. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సీజన్ 8 ఫైనల్ ఎపిసోడ్లో ఆసక్తికర ట్విస్ట్‌లు ఎన్నో ఉండనున్నాయట.