బాలయ్య ‘ డాకు మహారాజ్ ‘ సెకండ్ హీరో ఉన్నాడా.. ఎవరంటే..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ హీరోగా.. బాబి కొల్లి డైరెక్షన్లో తెరకెక్కుతున్న తాజా మూవీ డాకు మహారాజ్. సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఆడియన్స్‌ను పలకరించనుంది. జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్ చాందిని చౌదరి, శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్యా జైశ్వాల్ కనిపించనున్నారు. అయితే బాలయ్యకు జంటగా వీరిలో ఎవరు నటిస్తున్నారని దానిపై క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే.. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో కూడా ప్రమోషన్స్ చాలా లిమిటెడ్ గా జరుగుతున్నాయి.

NRIPage | Box Office | Movie News | 'NBK 109' New Film Title Revealed:  Daaku Maharaj

వాస్తవానికి సినిమా గురించి ఆడియన్స్ లో ఇప్పటికే ఎన్నో సందేహాలు ఉన్నాయి. టైటిల్ వినడానికి కొత్తగా అనిపిస్తుంది.. దాని అర్థం ఏమై ఉంటుంది.. మాస్ ఆడియన్స్ కు ఈ టైటిల్ అసలు ఎక్కుతుందా.. కథ ఏమై ఉంటుంది అనే విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి నెలకొంది. కానీ.. మూవీకి సంబంధించిన ఏ విషయం కూడా రివీల్‌ చేయకూడదని టీం డిసైడ్ అయినట్లు అర్థమవుతుంది. అయితే.. ఇప్పుడే సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ వైరల్ గా మారుతుంది. సినిమా కథ ప్రకారం.. ఇందులో మరో హీరో కూడా ఉన్నాడని సమాచారం. అయితే.. గతంలో విశ్వక్ సేన్‌ని ఆ పాత్రకు అడిగారట.

Dulquer Salmaan says he is hopeful that every Hindi film he does is  memorable for the audiences - The Economic Times

అతనికంటే ముందు.. నానిని కూడా సంప్రదించినట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఫైనల్ గా దుల్కర్ సల్మాన్‌తో పాత్ర చేయనున్నట్లు టాక్ నడుస్తుంది. అయితే.. ఈ వార్తలపై ఇప్పటివరకు టీం నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో కూడా సెకండ్ హీరో గురించి టీం ఎలాంటి హింట్ ఇవ్వకపోవడంతో.. ఆడియన్స్‌ను థ్రిల్ చేయాలని ఉద్దేశంతో మేకర్స్ దాన్ని హైలెట్ చేస్తున్నారని.. బహుశా ధియేటర్లో ఆడియ‌న్స్‌ సర్ప్రైజ్ ఫీల్ అవ్వడానికే చూస్తున్నారని.. లేదు అసలు ఆ సెకండ్ హీరో ఇంపార్టెన్స్ రోల్ ఎత్తేసి స్క్రిప్ట్ మార్చి కథ రూపొందించారని.. ఇలా ఎన్నో అభిప్రాయాలు నెటిజ‌న్లు నుంచి వ్యక్తమవుతున్నాయి. మేకర్స్‌ రియాక్ట్ అయితే కానీ దీనిపై క్లారిటీ రాదు.