టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమాలో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 రికార్డులను బ్రేక్ చేయగల సత్తా ఉన్న ఏకైక సినిమా అంటూ వార్ 2 పై ప్రచారం కొనసాగుతుంది. బాలీవుడ్ యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రూ.100 కోట్ల బడ్జెట్‌తో.. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ మూవీ పై ఆడియన్స్‌లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్‌తో తారక్ మరో సినిమా చేయనున్నాడు.
డైలాగ్ డెలివరీ, డ్యాన్స్, యాక్షన్ ఇలా ప్రతి విషయంలోను ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునే ఎన్టీఆర్.. ఫేవరెట్ హీరో ఎవరో తెలుసుకోవాలనే ఆశక్తి అందరిలోను ఉంటుంది. ఇక ఇదే ప్రశ్నను గతంలో రానా.. తారక్‌కు సంధించాడు. ఈ జనరేషన్ లో నీకు నచ్చే హీరో ఎవరు అని అడగగా.. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఎన్టీఆర్ కాస్త ఇబ్బంది పడినా.. ఒక్కొక్క హీరోలో ఒకో మంచి క్వాలిటీ ఉంటుందంటూ వెల్లడించాడు. మన జనరేషన్‌లో మహేష్ బాబు హ్యాండ్సమ్ హీరో.. అలా ఒక్కొక్క హీరోలో ఒక్కో ఫీచర్ ఉంటుంది అంటూ చెప్పుకోచాడు.
బాహుబలి తర్వాత నీ వాయిస్ కి నేను ఫిదా అయ్యా అంటూ చెప్పిన తారక్.. చివరిగా తన ఫేవరెట్ హీరో ఎవరో రివీల్ చేశాడు. ఈ జనరేషన్‌లో నాకు నాని నటన అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. నానికి తన భార్య లక్ష్మీ ప్రణతి అభిమానంటూ మరో ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ వెల్లడించాడు. నాని పిల్ల జమిందార్ సినిమా ఆమె కొన్ని వందలసార్లు చూసిందట. జనతా గ్యారేజ్ సినిమాకు ఉత్తమ నటుడుగా అవార్డు అందుకున్న టైంలో ఎన్టీఆర్ కామెంట్ చేశారు. 2017 ఐఫా అవార్డ్స్ లో ఉత్తమ నటుడుగా ఎన్టీఆర్ సక్సెస్ అందుకున్నాడు.