టాలీవుడ్ స్టార్ నటుడు, కమెడియన్ వెన్నెల కిషోర్ తాజాగా నటించిన మూవీ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. అనన్య నాగళ్ళ, రవి కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు రమణారెడ్డి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. రచయిత మోహన్ దర్శకత్వం వభించిన ఈ సినిమా 25 డిసెంబర్ 2024 అంటే నేడు.. గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ అయింది. ఇక కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్‌ను ఆకట్టుకుందో.. లేదో TJ సమీక్షలో చూద్దాం.
స్టోరీ:
సినిమాను డిటెక్టివ్ స్కిల్స్ మరియు ఎమోషనల్ కంటెంట్ మిక్స్ చేసి డిజైన్ చేశారు. అద్భుతమైన స్క్రీన్ ప్లే తో చివరి వరకు ఆకట్టుకునేలా సినిమాను రూపొందించారు. అందులో మిస్టరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ మరియు లవ్ స్టోరీ మిక్స్ చేసి చూపిస్తున్నారు. ఇక ఆసక్తికరంగా డిటెక్టివ్ రోల్‌ను డిజైన్ చేయడమే కాదు.. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌లు కూడా ప్రేక్షకులు కట్టిపడేసేలా డిజైన్ చేశారు. సినిమాలోని ప్రతీ సీన్ మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులను మెప్పిస్తుంది. స్టోరీలో ఎన్నో ఊహించని ట్విస్టులు, బలంగా ఉన్న పాత్రలు కనిపించాయి. క్లైమ్యాక్స్ ట్విస్ట్‌లు అసలు ఊహించలేరు.
నటీనటుల పర్ఫామెన్స్:
డిటెక్టివ్ రోల్‌లో వెన్నెల కిషోర్ తనదైన స్టైల్ లో నటించి మెప్పించాడు. ఆ పాత్రలో తెలివితేటలు, భావోద్వేగాలు రెండు గుణాలు ప్రేక్షకులను మెప్పించాయి. అనన్య నాగళ్ళ, రవి తమ పాత్రల్లో ఎమోషన్స్ ఫ్యామిలీ బాండింగ్స్‌గ్స్ చూపించడంలో సక్సెస్ సాధించారు. సినిమాలో పాటలు కొత్తగా అనిపించాయి. ప్రతి పాట కథను ముందుకు తీసుకువెళ్లడంలో కీరోల్ ప్లే చేశాయి. పాటల్లో బావలు.. కథలో సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడానికి సహకరించాయి.
టెక్నికల్ అండ్ డైరెక్షన్:
రచయిత మొహన్ దర్శకుడుగా ఈ సినిమాను కేవలం డిటెక్టివ్ స్టోరీ గానే కాదు.. హ్యూమన్ ఎమోషన్స్ ను డీపుగా టచ్ చేస్తూ కథను డిజైన్ చేశాడు. స్టోరీలోని ప్రతి ఎమోషన్ ప్రేక్షకులకు హార్ట్ టచింగ్ అనిపిస్తాయి. లవ్, ట్రస్ట్, ట్రాజడీ, వార్ ఇలా ప్రతి ఒక్కటి ఆకట్టుకుంటుంది. చివరిగా సినిమా యూనివర్సల్ ఆలోచన కలిగిన కథగా అందర్నీ ఆకట్టుకునేలా తెరకెక్కించారు. సినిమాటోగ్రఫీ మెప్పిస్తోంది. అయితే ఎమోషన్స్ మాత్రం అందరికి కనెక్ట్ కాకపోవడం సినిమాకు కాస్త మైనస్.
ఫైనల్ గా:
శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఒక్క స్పిరిచువల్, ఎమోషనల్, డిటెక్టివ్ స్టోరీ. ఎమోషన్స్ తో పాటు కామెడీ కూడా మిక్స్ చేసి చూపించారు. ఒక సినిమాలో అన్ని ఎమోషన్స్ ఎంజాయ్ చేయాలంటే ఈ సినిమా ఒక్క మంచి ఛాయిస్.
TJ రేటింగ్: 3 / 5