ఇటీవల అల్లు అర్జున్ అరెస్టు దేశవ్యాప్తంగా సంచలనగా మారిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాజకీయాల్లోనూ ఇదే హాట్ టాపిక్‌గా ట్రెండ్ అయింది. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. రేవంత్ రెడ్డి.. బన్నీ అరెస్ట్ గురించి మాట్లాడుతూ ఆయనేమీ ఇండియా, పాకిస్తాన్ బోర్డర్లో పోరాడిన వ్యక్తి కాదు.. అతని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. అతను ఒక నటుడు మాత్రమే అంటూ వెల్లడించాడు. న్యాయం అందరికీ ఒకేలా ఉంటుందని.. వాటిని గౌరవించండి అంటూ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చాడు.
అక్కడ ప్రాణం పోయింది.. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పరోక్షంగా సపోర్ట్ చేస్తానంటూ చాలా క్లియర్ గా స్పష్టం చేశాడు. ఇందులో భాగంగానే అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి ఫ్యామిలీ.. తనకు బాగా తెలుసని రేవంత్ వెల్లడించినట్లు సమాచారం. స్నేహ రెడ్డి తండ్రి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా.. ఓ బిజినెస్‌మాన్. హైదరాబాదులో సైన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చైర్మన్గా వ్యవహరిస్తున్న ఆయన.. గతంలో కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్‌లో కూడా చురుకైన నేతగా వ్యవహరించాడు.
అయితే తర్వాత కొన్ని కారణాలతో బీఆర్ఎస్ పార్టీలోకి చేరాడు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్లినట్లు టాక్. అయితే.. బన్నీ అరెస్ట్ విషయంపై చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వం మీద ఏమాత్రం ఒత్తిడి చేయలేదని.. ఈ ఘటన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు తెగ వైరల్‌గా మారుతున్నాయి. బన్నీ ఇంటికి వచ్చినప్పుడు కూడా స్నేహ రెడ్డి చాలా ఎమోషనల్‌గా కనిపించిన వీడియో ఇప్పటికి వైరల్ అవుతూనే ఉంది. మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి.