జక్కన్న – మహేష్ కాంబోలో రూ.600 కోట్ల రెమ్యూనరేషన్ హీరోయిన్.. నటించబోతుందా..?

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. బాహుబలి సినిమా మొదలుకొని తన ప్రతి సినిమాకు ఇండస్ట్రీ పరిధిని మరింత పెంచుకుంటూ పోతున్నాడు. ఈ క్రమంలోనే పాన్ ఇండియా లెవెల్‌లో తెలుగు సినిమా ఖ్యాతిని రెట్టింపు చేసిన జక్కన్న.. స్టార్ హీరో రేంజ్‌లో ఇమేజ్‌ సొంతం చేసుకున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో మన హీరోలు ఈరోజు అన్ని సినిమాలు నటిస్తున్నారంటే.. దానికి పరోక్షంగా రాజమౌళి కారణం అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఆర్ఆర్ఆర్‌ సినిమాతో ఏకంగా తెలుగు సినిమాకు ఇంటర్నేషనల్ మార్కెట్ క్రియేట్ చేసిన జక్కన్న.. సినిమాల కోసం యావ‌త్‌ భారతదేశం అంతా ఎదురు చూసేలా, విదేశీ ప్రేక్షకులు కూడా జక్కన్న సినిమా కోసం ఆరాటపడేలా చేశాడు. అంతేకాదు ఇండియన్స్ చిరకాల ఆస్కార్ అవార్డు కూడా రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో నెరవేర్చారు.

SS Rajamouli shares update on his next with Mahesh Babu

ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ రేంజ్ లో మరోసారి తెలుగు సినిమా సత్తా చాటేందుకు సిద్దమవుతున్నాడు. ఏకంగా హాలీవుడ్ మార్కెట్ కబ్జ‌ చేసే ప్లాన్ లో ఉన్నాడు. ఈ క్రమంలో.. సినిమా కోసం హాలీవుడ్ నుంచి స్టార్‌న‌టుల‌ను మాత్రమే కాదు హాలీవుడ్ టెక్నీషియన్స్‌ను కూడా రంగంలోకి దింపుతున్నాడు. ఇప్పటికే తోర్ మూవీ.. హీరో క్రిస్ హేమ్ బర్త్‌ ఈ సినిమాలో కీలక పాత్ర కోసం సంప్రదించినట్లు టాక్. అంతేకాదు ఈ సినిమా కోసం మరో ప్రముఖ హాలీవుడ్ స్టార్‌ను రాజమౌళి తీసుకునే ప్రయత్నంలో ఉన్నాడట. హాలీవుడ్లో ఒకప్పుడు సూపర్ స్టార్ ని మించిన రెమ్యునరేషన్ అందుకున్న నటి.. గ్రావిటీ సినిమాలో ఆమె నటించినందుకు గాను ఏకంగా రూ.600 కోట్లు రెమ్యూనరేషన్‌ తీసుకుంది.

Sandra Bullock At 60: A Hollywood Icon's Journey Of Grace

ఆమె పేరే సాండ్రా బుల్లక్. హాలీవుడ్లో హీరోయిన్గా, క్యారెక్టర్ అర్టిస్ట్‌గా, విలన్ గా ఎన్నో వందల సినిమాల్లో నటించినా సాండ్రా బుల్లక్.. రాజమౌళి సినిమాలో నటించబోతుంద‌ని తెలుస్తుంది. ఇక దాదాపు రూ.1200 కోట్ల బడ్జెట్‌తో ప్లాన్ చేసిన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి నెల నుంచి షూటింగ్ ప్రారంభం కాదట. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన రాకున్నా.. ఇప్పటికే న్యూస్ వైరల్ గా మారుతుంది. ఇక ఈ సినిమాను రెండు భాగాలుగా తెర‌కెక్కించాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నాడట. మొదటి భాగం 2027లో రిలీజ్ అవుతుందని.. తర్వాత రెండో భాగం 2029లో రిలీజ్ చేయనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు ఇప్పటికే లుక్ మార్చుకొని మేకోవర్‌తో సిద్ధంగా ఉన్నారు. టీజ‌ర్ మాత్రమే కాదు.. మహేష్ లుక్ ఎవరు ఊహించని విధంగా ఉండబోతుందట.