108 అడుగుల భారీ బాల‌య్య‌ క‌టౌట్ … బెజ‌వాడ గ‌డ్డ‌పై న‌ట‌సింహం గ‌ర్జ‌న‌…!

సాధారణంగా ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో నుంచి సినిమా రిలీజ్ అవుతుందంటే.. ఆ హీరో అభిమానులంతా తమ అభిమాన హీరో సినిమాను చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో వారి భారీ ఫ్లెక్సీలను థియేటర్ల ముందు ప్రదర్శించి.. తమ అభిమానాన్ని చాటుకుంటారు. అలా తాజాగా గేమ్ ఛేంజర్ రిలీజ్ దగ్గర పడుతున్న క్రమంలో.. విజయవాడలో రామ్ చరణ్ అభిమానులు గేమ్ ఛేంజ‌ర్ కు సంబంధించిన భారీ కటౌట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Vijayawada: 1986లో 108 అడుగుల బాలకృష్ణ భారీ కటౌట్

ఏకంగా 256 అడుగుల భారీ కటౌట్ ప్రదర్శించారు ఫ్యాన్స్‌. ప్రస్తుతం ఆ కటౌట్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ ట్రైడింగ్ గా మారుతున్నాయి. అయితే దీనికంటే ముందే.. బెజవాడ వాసులు బాలయ్య పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. 80వ దశకంలోనే దేశంలోనే అతిభారీ బాలయ్య కటౌట్ ఏర్పాటు చేసి వార్తల్లో నిలిచారు. సినిమాలు అన్న తమ ఫేవరెట్ నటుల‌న్నా ప్రాణాలు ఇచ్చే బెజవాడ వాసులు.. బాలయ్య గర్జనను 1986లోనే చూపించారు.

Manabalayya.com - #Balayya 108 feet cut out at #vijayawada... | Facebook

నందమూరి నట‌సింహం బాలకృష్ణ నటించిన దేశోద్ధారకుడు సినిమా రిలీజ్ సందర్భంగా.. అప్పట్లోనే ఏకంగా 108 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేసి.. రికార్డ్ సృష్టించారు. అలంకార్ థియేటర్ వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ భారీ కటౌట్‌ను చూసేందుకే అప్పట్లో జనం తండోపతండాలుగా తరలివచ్చారు. అలా గ్లోబల్ స్టార్ కంటే ముందే బాలయ్య పై బెజవాడ అభిమానులు భారీ రేంజ్‌లో తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం బాలయ్య ఆ పాత కటౌట్ ఫొటోస్ తో పాటు.. దానికి సంబంధించిన వివరాలు మ‌రోసారి వైరల్ గా మారుతున్నాయి.