ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్‌ను పలకరించిన సమంతకు తెలుగులో ఎలాంటి పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతి తక్కువ సమయంలోనే అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. ఇక లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ తనదైన ముద్ర వేసుకున్న సమంత.. ఫ్యామిలీమాన్ లాంటి బోల్డ్ వెబ్ సిరీస్ లను ఆకట్టుకుంది. కాగా గత కొంతకాలంగా మైయోసైటిస్ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడు త్వరలోనే మరో బాలీవుడ్ వెబ్ సిరీస్ సెటాడెల్.. హనీ బన్నీతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతుంది.
ఇక సమంత గతంలో ఎంతో హుషారుగా కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉండేది. సినిమా ప్రమోషన్స్ లో కూడా ఆమె కామెడీ టైమింగ్ హైలెట్గా నిలిచేది. అయితే ఇటీవల సమంత ఇస్తున్న ప్రమోషన్స్ లో కానీ.. ఆమె కామెడీ టైమింగ్స్ లో కానీ.. పూర్తిగా వైవిధ్యత వచ్చేసింది. తనకున్న వ్యక్తిగత సమస్యల కారణంగానే సమంత ఇలా మారిపోయిందని.. ప్రతిసారి తన రీసెంట్ టైమ్స్ ఇంటర్వ్యూస్‌లో ఎమోషనల్ అవుతుందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనికి తన వ్యక్తిగత కారణాలతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా కారణం కావచ్చు. అయితే తాజాగా ఇదే విషయంపై రానా ఆమెను ప్రశ్నించాడు.
ఐఫా అవార్డ్స్ వేదికపై సమంతను ఇన్వైట్ చేసిన రానా.. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు వెళ్ళావు. సిస్టర్‌ఇన్‌లా నుంచి సిస్టర్ గా మారిపోయావు. అయితే అప్పట్లో కామెడీ చేసి అందరినీ నవ్వించిన సమంత ఇప్పుడు ఏమయ్యారు అంటూ రానా ప్రశ్నించాడు. దానికి సమంత చేసే కామెడీ ఎప్పుడో ముగిసిపోయింది అంటూ సమాధానం చెప్పింది. అలాగే రానా నాయుడు సిరీస్ పై ఆమె సెటైర్లు వేసుకోచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. అయితే సినిమాలకు ఏడాదిన్నర గ్యాప్ ఇచ్చినా.. సమంత కెరీర్ గ్రాఫ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు సరి కదా.. ఇంకా పెరుగుతూ వస్తుంది. ఈ రేంజ్‌లో సమంతను ఆడియన్స్ ఆదరించడం విశేషం. కేవలం టాలీవుడ్ లోనే కాదు.. హాలీవుడ్ లోను ఈమె సినిమాలకు ప్రేక్షకులు ఆశక్తి చూపుతున్నారు.