పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తెలుగు ఆడియన్స్ లో ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో మరేహీరోకి లేనంత ఫ్యాన్ బేస్ పవర్ స్టార్ సొంతమన్నడంలో అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేబట్టి బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. దీంతో తన రన్నింగ్ ప్రాజెక్ట్స్‌ను తాత్కాలికంగా హోల్డ్ లో పెట్టిన పవన్.. ప్రస్తుతం ప్రజాసేవకు టైం కేటాయిస్తున్నాడు. త్వరలో ఈ సినిమాలు పూర్తి చేస్తానని గతంలోనే ఫాన్స్ కు హామీ ఇచ్చాడు. మెగాస్టార్ తమ్ముడుగా కెరీర్ ప్రారంభించిన పవన్.. అతి తక్కువ సమయంలోనే పవర్ స్టార్ గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు.
బద్రి, తమ్ముడు, ఖుషి లాంటి సినిమాలతో స్టార్‌డం సంపాదించుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోల్లో ఒకరిగా ఉన్నాడు. సినీ రంగంలోకి అడుగుపెట్టిన పవన్.. తన మొదటి సినిమా రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. మొదటి డైరెక్టర్ కావాలనుకున్న పవన్ సురేఖ నచ్చ చెప్పడంతో నటుడుగా మారాడు. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన పవన్.. నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డతో కలిసి సినిమాలో నటించాడు. ఖయామత్ సే కయామత్ అనే హిందీ సినిమాకు రీమేక్ సినిమా తెరకెక్కి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
ఇక సినిమాకు గీత ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందింది. అయితే పవన్ తన ఫస్ట్ సినిమా రెమ్యూనరేషన్ ఎంత ఉంటుందని ఆసక్తి అభిమానులలో ఉంటుంది. కాగా పవన్ తన ఫస్ట్ సినిమాకు కేవలం రూ.50 వేల రెమ్యూనరేషన్ మాత్రమే పుచ్చుకున్నాడట. ఈ సినిమా కోసం పవన్ నెలవారి జీతం తీసుకునేవాడట. అంటే నెలకు రూ.5వేలు మాత్రమే ఆయన అడిగారట. అలా సినిమా మొత్తం పూర్తయ్యేసరికి పవన్ కళ్యాణ్ రూ.50వేలు తీసుకున్నడట. ప్రస్తుతం ఏ న్యూస్ నెటింట వైరల్ అవ్వడంతో పవన్ ఫ్యాన్స్ అంతా నోరెళబెడుతున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ తన ఒక్క సినిమాకు దాదాపు రూ.100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట.