సాధారణంగా చాలా ఇండస్ట్రీలో భాషా ప్రీతి ఎక్కువగా ఉంటుంది. తమ సినిమాలు తప్ప ఇతర ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలు ఏవి సక్సెస్ సాధించకూడదని తమ సినిమాలు తప్ప.. ఇండస్ట్రీలో మరో సినిమా ఆడకూడదని.. ఆలోచనలో అక్కడి ప్రేక్షకులు సైతం ఉంటారు. చిన్నాచితక విషయాలకు కూడా.. ఇతర ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలను బాయికాట్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఉంటారు. తమ సినిమాలో అక్కడ ఇండస్ట్రీలో ఆడకపోయినా.. అక్కడ ఇండస్ట్రీలో సినిమాలను తమ ఇండస్ట్రీలో రిలీజ్ చేయకూడదని పటుపడతారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు పుష్ప 2 సినిమా విషయంలో ఎదురవుతుంది.
కన్నడ సినీ ఇండస్ట్రీలో పుష్ప 2ను బాయికాట్ చేయాలంటూ ఆడియన్స్ డిమాండ్లు చేయడం ప్రస్తుతం సెన్సేషనల్ గా మారింది. కన్నడలో పుష్ప 2 బాయ్‌కాట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల కన్నడ నుంచి వచ్చిన భఘీర సినిమా టాలీవుడ్ లోనూ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు తెలుగులో తక్కువ థియేటర్స్ ఇచ్చారు. దానికి తోడు ఇప్పుడు ఆ థియేటర్ల సంఖ్యను మరింతగా తగ్గించాలనే కసితో కన్నడ ఇండస్ట్రీ వారు రగిలిపోతున్నారట. ఈ క్రమంలోనే పుష్ప 2 కన్నడలో బాయ్‌కాట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక భఘీరకు తక్కువ ధియేటర్లు ఇవ్వడం.. ఇచ్చిన థియేటర్లను ఖాళీ చేయించడానికి వెనుక సరైన కారణమే ఉందని సమాచారం.
అమరాన్, లక్కీ భాస్కర్, క, భఘీర ఈ నాలుగు సినిమాలు దీపావళి కానుకగా రిలీజ్ కాగా.. భగీర తప్ప మిగతా మూడు సినిమాలు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకున్నాయి. అయితే భఘీర రిలీజ్ డేట్ నుంచే నెగటివ్ టాక్ రావడంతో.. మిగతా సినిమాలకు జనం తాకిడి ఎక్కువ కావడంతో.. ఆ సినిమాలకు థియేటర్స్ ఇస్తే కాస్త ఆదాయాన్ని గడించవచ్చు లేదంటే భారీగా నష్టపోవాల్సి వస్తుందని ఉద్దేశంతో భఘీరను థియేటర్లలో తగ్గించారట. మరి కన్నడ ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా.. తెలుగు సినిమాను బాయ్‌కట్ చేయాలని కామెంట్ చేస్తున్నారో.. ఇంకేదైనా ఇతర కారణాలు ఉన్నాయో తెలియదు కానీ.. ప్రస్తుతం పుష్ప 2ను బాయ్‌కాట్ చేయమని మాత్రం వారు తెగ ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తుంది.