తారక్ ను ఒరేయ్ బండోడా అంటూ చనువుగా పిలిచే ఏకైక వ్యక్తి ఆమెనా..?

సాధారణ ప్రజల నుంచి స్టార్ సెలబ్రిటీస్ వరకు ఎవరైనా సరే.. చనువుగా ఉండే వ్యక్తులు ఎలాంటి పేరుతో పిలిచినా దానిని పెద్దగా లెక్కచేయరు. అయితే చాలామంది స్టార్ హీరోల అభిమానులు మాత్రం తమ హీరోలను రెస్పెక్ట్ ఇవ్వాలని.. వాడు, వీడు, నువ్వు, ఒరేయ్‌ అంటూ అగౌరవంగా మాట్లాడకూడదని ఆరాటపడుతూ ఉంటారు. అయితే స్టార్ నటులు మాత్రం తమకు చనువుగా ఉండే వ్యక్తులు.. క్లోజ్ రిలేటివ్స్ ఎలా పిలిచినా పర్వాలేదు అనుకుంటూ ఉంటారు. ఇంకా చనువుగా వారు పిలవీల‌నే వాళ్ళు ఇష్టపడుతుంటారు. ఆ లిస్టులోకే వస్తాడు జూనియర్ ఎన్టీఆర్. తన అనుకున్న వాళ్లు ఎలా పిలిచినా.. ఆయన ఆనందంగా దానిని స్వీకరిస్తాడు. ఇక తాజాగా దేవర సినిమాతో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న ఆయన.. త్వరలోనే వార్ 2 సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు.

Jr NTR Naatu Naatu RRR reveals toughest part of Naatu Naatu was not the  dance steps. THIS was - India Today

ఈ సినిమా తర్వాత ప్రశాంత్ డైరెక్షన్లో మరో సినిమాలో నటించనున్నాడు. దీని త‌ర్వాత దేవ‌ర పార్ట్ 2 కూడా లైన్లో ఉంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాల లైనప్‌తో బిజీగా గడుపుతున్నాడు తారక్. ఇలాంటి క్రమంలో ఈయనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెటింట‌ వైరల్ గా మారుతుంది. తారక్ సినిమాల విషయాలు ఎప్పటికప్పుడు నెటింట‌ వైరల్ అయిన.. పర్సనల్ విషయాలు మాత్రం చాలా వరకు గోప్యంగానే ఉంచుతారు. కాగా ఇప్పుడు ఎన్టీఆర్ కు సంబంధించిన పర్సనల్ మ్యాట‌ర్‌ ఒక‌టి నెటింట‌ వైరల్‌గా మారుతుంది. ఎన్టీఆర్ ను ముద్దుగా యంగ్ టైగర్, తారక్, జూనియర్ అంటూ ఫ్యాన్స్‌తో పాటు చాలామంది పిలుస్తూ ఉంటారు. కానీ తారక్ ను ఒకే ఒక్క వ్యక్తి మాత్రం ఎంతో చనువుగా ఒరేయ్ బండోడా అని పిలుస్తూ ఉంటుందట.

keeravani - Telugu Lives - Telugu Latest News

ఆమె నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి కాదు. వారికి ఎలాంటి బంధుత్వం లేదు. కేవలం వారి మధ్యన ఉన్న మంచి స్నేహం, చనువుతోనే.. ఆమె అలా పిలుస్తుందట. ఇంతకీ తను ఎవరో చెప్పలేదు కదా.. తనే కీరవాణి భార్య వల్లి. కీరవాణి భార్య వల్లి అందరితోనూ చాలా మంచిగా.. చనువుగా.. వ్యవహరిస్తూ ఉంటుంది. ఇప్పటికే ప్రభాస్, రానా, అనుష్క లాంటి వారు కూడా ఈమెకు చాలా క్లోజ్ గా ఉంటారు. అయితే తారక్ ఇంకా క్లోజ్ అట. తారక్ తనకు కావాలనుకుంటే ఆమె ఇంట్లోకి వెళ్లి మరి కావలసింది వండించుకుని తినేస్తారట. అంత చనువు వీరిద్దరి మధ్యన ఉందట. అలా యంగ్ టైగర్‌ను ఒరేయ్ బండోడా అంటూ వల్లి పిలుస్తూ ఉంటుందట. ఇప్పుడు కాదు.. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి ఈ పేరుతోనే ఆయన్ను సంబోధిస్తుందట. అప్పట్లో తారక్ బాగా లావుగా ఉండేవారు. ఈ క్రమంలోనే ఆ పేరుకు అలవాటు పడిన వల్లి.. ఇప్పుడు ఆయన బరువు తగ్గి స్లిమ్ లుక్ లో ఆకట్టుకుంటున్న సరే బండోడా అనే పిలుస్తుందట.