బాలయ్య తో నటించే ఛాన్స్ ను ఏకంగా మూడుసార్లు రిజెక్ట్ చేసిన అన్ లక్కీ హీరోయిన్ ఎవరో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. ఇటీవల ఆయన తర్కెక్కించిన మూడు సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్లుగా నిలవడంతో.. హ్యాట్రిక్‌హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న బాలయ్య.. త్వరలోనే తన 109వ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 13న బాలయ్య ఎన్‌బికే 109 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు డాకు మహారాజ్ అనే టైటిల్ మేకర్స్ అనౌన్స్ చేస్తూ ఇంట్రెస్టింగ్ టీజర్ కూడా రిలీజ్ చేశారు.

Did you know Meera Jasmine is making a comeback after a break of half a  decade? | Malayalam Movie News - Times of India

ఇక ఈ ఇటీజర్ కు ప్రస్తుతం నెటింట‌ మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇలాంటి క్రమంలో బాలయ్యకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒక‌టి తెగ‌ వైరల్ గా మారుతుంది. బాలయ్యలాంటి స్టార్ హీరోతో నటించాలని చాలామంది స్టార్ హీరోయిన్ ఆరాటపడుతూ ఉంటారు. ఆయనతో అవకాశం వస్తే నో చెప్పకుండా నటిస్తారు. కానీ.. బాలయ్యతో నటించే అవ‌కాశం ఒక‌టి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు సార్లు వచ్చిన ఓ స్టార్ హీరోయిన్ పదే పదే రిజెక్ట్ చేస్తూ వచ్చిందట. ఎవో కారణాలతో అవకాశాలను మిస్‌ చేసుకుంటూనే వచ్చిందట. ఇంతకీ ఆమె ఎవరో కాదు మీరాజాస్మిన్.

Veera Simha Reddy Emerges As Biggest Grosser In NBK Career | cinejosh.com

తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు.. అఖండ సినిమాల్లో ప్రగ్యా జైస్వాల్ పాత్ర కోసం అవకాశం వచ్చిన రిజెక్ట్ చేసింది. తర్వాత వీర సింహారెడ్డి సినిమాలో హాని రోజ్ పాత్రను కూడా ఆమె వదులుకుందని సమాచారం. ఇక త్వరలోనే బాలయ్య నుంచి రానున్న డాకు మహారాజ్ సినిమాలో నటించే ఛాన్స్ కూడా ఆమె రిజెక్ట్ చేసిందని వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే బాలయ్య ఫ్యాన్స్ మీరాజాస్మిన్ పై ఫైర్ అవుతున్నారు. ఈమె అంతా అన్ ల‌క్కీ ఫెలో మరొకరు ఉండరూ అంటూ.. అసలు బాలయ్యతో సినిమాలో రిజెక్ట్ చేసే అంతా అవసరం ఏముంది అంటూ ఫైర్ అవుతున్నారు.