ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. గ్లోబల్ లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్‌క్రియేట్ చేసుకుని మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న రామచరణ్ తాజాగా మరో రేర్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మేడం టుసాడ్స్‌లో రాంచరణ్ మైనపు విగ్రహం సందడి చేయనందుని గతంలో వార్తలు వైరలైన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా అఫీషియల్ ప్రకటన వచ్చింది. అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డ్స్‌లో భాగంగా దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలువడింది. 2025 సమ్మర్ టైం కి చరణ్ విగ్రహం సందర్శన కొరకు మెరవనుందని సమాచారం.
ఈ క్రమంలోనే రామ్‌చరణ్ తనకు దక్కిన ఈ అరుదైన రికార్డ్ విషయంలో సంతోషాన్ని వ్యక్తం చేశాడు. సింగపూర్‌లోని మేడం టుసాడ్స్‌లో కొలువుదీరిన సూపర్ స్టార్స్ సరసన నాకు కూడా చోటు దక్కడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానంటూ వెల్లడించాడు. చిన్నప్పుడు లెజెండరీ నటులు విగ్రహాలు చూసి ఆశ్చర్యపోయే వాడినని.. అలాంటిది వారి పక్కన నాకు ఇలాంటి గౌరవం దక్కుతుందని కలలో కూడా ఊహించలేదంటూ చెప్పుకొచ్చాడు. సినిమాల కోసం నేను పడే కష్టం.. నాకు సినిమాలపై ఉన్న ఫ్యాషన్.. ఈ గౌరవాన్ని నాకు తెచ్చిపెట్టాయని చరణ్ వెల్లడించాడు. అపూర్వమైన అవకాశం ఇచ్చిన మేడం తోసాడ్స్ ప్రతినిధులకు ధన్యవాదాలు అంటూ వివరించాడు.
అయితే ఇప్పటివరకు కేవలం మేడమ్ టుస్సాడ్స్‌లో క్వీన్ ఎలిజిబెత్2కు మాత్రమే దక్కిన అరుదైన గౌరవం పెంపుడు జంతువులతో ఆమె మైనప్పు విగ్రహం. ఇప్పుడు అదే గౌరవం రామ్ చరణ్‌కు దక్కిందట. రామ్ చరణ్ తన పెంపుడు కుక్కతో ఉండే విగ్రహంలో మేడంటుప్పాడ్స్‌లో ప్రత్యక్షం కానున్నాడు. ఇక రామ్‌చరణ్ కొద్దికాలం క్రితం క్లింకారకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. క్లింకార పుట్టిన తర్వాత నుంచి చరణ ఎన్నో అరుదైన గనతలను సాధిస్తూ అభిమానులకు సంతోషాన్ని కల్పిస్తున్నాడు. ఇక చరణ్ సినిమాల విషయంలో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పై చూపిస్తున్న శ్రద్ధ విషయంలో ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. చరణ్‌కు ముందు ముందు మరిన్ని సక్సెస్‌లు అందాలన్నీ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.