ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో రానున్న తాజా మూవీ పుష్ప 2. ఈ సినిమాపై ఇప్పటికే నార్త్ ఆడియన్స్‌లో మంచి హెప్ నెలకొంది. ఈ సినిమా మొదటి భాగంగా వచ్చిన పుష్పా ది రైజ్ నార్త్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్‌ను బ్రేక్ చేసింది. ఈ క్రమంలోనే 2024 డిసెంబర్ 6న రానున్న ఈ సినిమా సీక్వెల్‌పై నార్త్ ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే థియేట్రికల్ రైట్స్ కూడా రూ.200 కోట్లకు అమ్ముడుపోయినట్లు.. పుష్ప2 ఫుల్ మూవీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ టోటల్గా రూ.1065 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే హీరోయిన్స్ బిజినెస్ జరగడం ఇదే మొదటిసారి.
ఈ క్రమంలో పుష్ప2 మూవీ బాహుబలి 2, కేజీఎఫ్ 2 సెంటిమెంట్లను రిపీట్ చేసి బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ అభిమానులు ఆశపడుతున్నారు. బాహుబలి, కేజిఎఫ్‌లు మొదటి సిరీస్ నచ్చడంతో తనకి సీక్వెల్‌గా తెరకెక్కిన పార్ట్ 2 అందరూ చూసి మంచి బ్లాక్ బస్టర్‌గా నిలిపారు. ఈ క్రమంలోనే పుష్ప పార్ట్1 కూడా ఆడియన్స్‌కు విపరీతంగా నచ్చేసింది. దీంతో పుష్స పార్ట్2కు కూడా ఆ రెండు బ్లాక్ బాస్టర్ల సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ సినిమా కోసం పిచ్చెక్కిపోతున్నారు. ఈ క్రమంలో నార్త్ ఇండియా కలెక్షన్లు ఒక రేంజ్‌లో ఉంటాయని టాక్. ఉదాహరణకు ఏడేళ్ల కింద బాహుబలి 2 రిలీజై కేవలం బాలీవుడ్ లోనే రూ.500 కోట్ల కలెక్షన్లకు కొలగొట్టాయి. ఇక్కడ ఈ స్థాయిలో కలెక్షన్స్ చేసిన మొట్టమొదటి సినిమా బాహుబలి.
తర్వాత కేజిఎఫ్ చాప్టర్ 2 కూడా నార్త్ బాక్సాఫీస్ దగ్గర రూ.427 కోట్లు కలెక్షన్లను దక్కించుకుంది. ఈ రెండు సినిమాల ఫస్ట్ పార్ట్ బాలీవుడ్‌ను షేక్ చేశాయి. ఈ క్రమంలోనే వాటి నెక్స్ట్ పార్ట్ బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ తర్వాత మళ్లీ అదే రేంజ్లో హిట్ అయిన మూవీ ఇప్పటివరకు రాలేదు. ఆర్ఆర్ఆర్ రూ.250 కోట్లు, కల్కి రూ.300 కోట్లు లోపు మాత్రమే కలెక్షన్లు వసూలు చేశాయి. ఈ రెండు సినిమాల తర్వాత మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్ని భారీ కలెక్షన్‌లు తెచ్చిన మూవీ పుష్ప. ఈ క్రమంలో పుష్ప 2.. బాహుబలి 2, కేజీఎఫ్ 2 లాగా భారీ కలెక్షన్లు కొల్లబడుతుందని.. ఎంత లేదన్న ఈజీగా రూ.600 కోట్ల కలెక్షన్లు నార్త్ బెల్ట్ లోనే పుష్ప సాధిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. మేకర్స్ అంచనాలు నిజమైతే పాన్ ఇండియా లెవెల్‌లో అల్లు అర్జున్ మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం. అంతేకాదు ఈ సినిమా హిట్ అయితే బన్నీ టాలీవుడ్‌లోనే నెంబర్ వన్ హీరోగా మారతాడు అనడంలో సందేహం లేదు.