టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కనున్న తాజా మూవీ వార్ 2. ఈ సినిమాకు పాన్ ఇండియా లెవల్‌లో విపరీతమైన హైప్ నెలకొంది. ఇటీవల తారక్ నుంచి వచ్చిన దేవర బ్లాక్ బస్టర్ సక్సెస్ కావడంతో పాటు.. మరిన్ని అంచనాలు పెరిగాయి. అయితే తాజాగా ఈ సినిమా షూట్ ఇటలీలో పూర్తి చేస్తున్నారని.. త్వరలోనే షెడ్యూల్ పూర్తయ్యాక ఇండియా వచ్చి ముంబై సెట్స్ లో తారక్ సందడి చేయనున్నాడని సమాచారం. ఈ క్రమంలోనే వార్ 2 సినిమాలో తారక రోల్ పై ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది.
అంతేకాదు డబ్బింగ్ వెర్షన్ కోసం సినిమా టైటిల్ ని కూడా మార్చనున్నారని టాకఖ ఈ క్రమంలోనే చిరంజివీ తెలుగులో నటించి సక్స్ అందుకున్న యుద్ధభూమి టైటిల్‌ను తెలుగు, తమిళ్ తదితర భాషల్లో పెట్టనున్నారట. అయితే యూనిట్ నుంచి అందుతున్న వార్తల ప్రకారం టైటిల్ మార్చే ప్లాన్ లేదని.. కేవలం ఇవన్నీ పుకార్లు అంటూ తెలుస్తుంది. యుద్ధభూమి క్యాప్షన్ గా వాడే అవకాశం ఉంది. అంతే కానీ.. వార్ 2 పేరును మార్చడం.. వార్ అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాక టైటిల్ మార్చే పనులు యష్‌రాజ్ ఫిలిమ్స్ చేయావని ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. స్పై యూనివర్స్‌ను విస్తరించే క్రమంలో టైగర్, పఠాన్, ఆల్ఫా పాత్రలన్నింటినీ అవెంజర్స్ తరహాలో డిజైన్ చేసిన ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా వారి టైటిల్ జనాల్లోకి చాలా బలంగా చర్చికి పోయేలా డిజైన్ చేశారు.
కనుక ఇప్పుడు రూపొందుతున్న వార్ 2 సినిమాకు కూడా టైటిల్ అదే ఉంచడం న్యాయమని వెల్లడించారు. ఇక ఆగస్టు 14న వార్ 2 సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాను డైరెక్టర్ అయాన్ ముఖర్జీ పూర్తిస్థాయిలో ముగించే ప్లాన్ లో ఉన్నారట. పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం కేటాయించి బెస్ట్ అవుట్ ఫుట్ ఇవ్వాలని ఉద్దేశంతో యూనిట్ కష్టపడుతున్నట్లు.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడు చూడని బెస్ట్ యాక్షన్ విజువల్స్ వార్ 2లో ఉండనున్నాయని వార్తలు వైరల్ అవుతున్నాయి. నాటు.. నాటు.. మించి పోయే రేంజ్ లో తారక్ హృతిక్ మధ్య ఒక సాంగ్‌కు డ్యాన్స్ స్టెప్స్ అదరకొట్టనున్నారని టాక్.