టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాజా మూవీ ‘ క ‘. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో దీపావళి కానుకగా రిలీజ్ చేయనున్నారు. నయన్ సారిక హిరోయిన్‌గా నటించగా.. తన్వి రామ్, అచ్యుత్ కుమార్ తదితరులు కీలకపాత్రలో కనిపించనున్నారు. సుజిత్ అండ్ సందీప్ దర్శకులుగా వ్యవహరించిన ఈ సినిమాకు.. చింత గోపాలకృష్ణ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. సామ్ సి ఎస్ సంగీతం అందించిన ఈ సినిమా తాజాగా ప్రీమియర్ షోలు రిలీజ్ చేశారు. సినిమా ఆడియన్స్‌ను మెప్పించిందా.. లేదా.. కిరణ్ అబ్బవరం హిట్ కొట్టాడా.. ఫట్ అనిపించాడా రివ్యూ లో చూద్దాం.
కథ
అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) ఓ అనాధగా పెరుగుతాడు. అతనికి చిన్నప్పటి నుంచి ఇతరుల ఉత్తరాలు చదవడం చాలా ఇష్టం. దొంగచాటుగా ఉత్తరాల చదువుతున్న క్రమంలో మాస్టర్ ఇంట్లో ఉత్తరం చదువుతు ఆయనకు దొరుకుతాడు. దీంతో ఆయన చివాట్లు పెట్టడంతో.. అక్కడి నుంచి వేరే ఊరికి పారిపోతాడు. అక్కడ పనులు చేసుకుంటూ బతుకుతాడు. కానీ.. పక్కన వాళ్ళ ఉత్తరాలు చదివే అలవాట్లు మాత్రం పోదు. అందుకోసమే స్నేహితుడు సాయంతో కృష్ణగిరి అనే ఊరికి షిఫ్ట్ అవుతాడు. అక్కడ టెంపరరీ పోస్ట్ మ్యాన్ జాబ్ ను సంపాదించుకుంటాడు. ఇక ఆ ఊరిలో మూడు గంటలకే చీకటి పడిపోతూ ఉంటుంది. మరో పక్క తెల్లవారుజామున 5 గంటలకు అమ్మాయిలు కిడ్నాప్ అవుతూ ఉంటారు. ఇంతకీ ఈ సినిమాలో హైలెట్ అవుతున్న సత్యభామ, రాధ ఎవరు..? అసలు అమ్మాయిలను కిడ్నాప్ చేస్తుంది ఎవరు..? అసలు క అంటే ఏంటో..? తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
కథ విశ్లేషణ
హీరోను అజ్ఞాత వ్యక్తి కిడ్నాప్ చేయడంతో స్టోరీ ప్రారంభమవుతుంది. హీరోని కథ చెప్పమని మధ్య మధ్యలో టార్చర్ చేస్తూ ఉంటాడు ఆజ్ఞత వ్యక్తి. ఇంటర్వెల్ కు అతని ఫేస్ రివిల్ అవుతుంది. ఇప్పటివరకు ఎన్నో థ్రిల్లర్ సినిమాలు చూసే ఆడియన్స్‌కు ఇది కొత్తగా ఏమీ అనిపించదు. సినిమాలో పెద్దగా ట్విస్టులు కూడా లేవు. కామెడీ నవ్వు తెప్పించేలా ఉన్నా.. ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ సేఫ్ చేసే సీన్ తప్ప.. ఏది ప్రేక్షకులను మెప్పించలేదు. పైగా సెట్ చూస్తే కాంతారా సెట్ గుర్తొస్తుంది. టాలీవుడ్ దర్శకులకు కాంతారా ప్రభావం ఇంతలా ఉందా అనిపించేలా సినిమా సెట్స్ కనిపిస్తాయి. కనుక ‘ క ‘ లో అంత గొప్పగా చూడదగ్గ అంశాలు ఏమీ ఉండవు, ఫ్రీ క్లైమాక్స్ బ్లాక్ కొంతవరకు ఓకే అనిపించినా.. సినిమా రిజల్ట్ మార్చే రేంజ్ లో మాత్రం లేదు. ట్విస్ట్‌లని ముందే ఎక్స్పెక్ట్ చేసినట్లుగా అనిపిస్తున్నాయి. సో సినిమా పెట్టగా కిక్ అనిపించదు. సినిమాకు ఫ్రీ ఇంటర్వెల్, ఫ్రీ క్లైమాక్స్ ప్లస్ పాయింట్ లుగా ఉంటాయి. ఇక మైనస్లు ఏంటంటే సినిమాలో పెద్దగా ట్విస్టులు లేకపోవడం. స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
టెక్నికల్ గా
ఇక టెక్నికల్ టీం బాగా పనిచేసినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా సామ్ సి ఎస్.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సతీష్ రెడ్డి డానియెల్ సినిమాటోగ్రఫీ.. నాణ్యత విలువలు తెలుపుతుంది. నిర్మాణ విలువలు ఒకే.. ఒకే.. అనిపించాయి.
నటీనటుల పర్ఫామెన్స్
కిరణ్ అబ్బవరం నటనలో కొత్తదనం అంతగా కనిపించలేదు. ఆయన ఇమేజ్‌కు మించిపోయే యాక్షన్ ఎలివేషన్లు పెట్టి పాత్రలో న్యాచురాలిటీని పోగొట్టేశారన్న ఫీలింగ్ ఆడియన్స్‌కు కలుగుతుంది. హీరోయిన్ నయన్ సారిక.. రెగ్యులర్ హీరోయిన్ లానే కనిపించింది. తాన్వి రామ్ నటన బాగుంది. ఆ ఇతర నటుల పర్ఫామెన్స్ ఓకే.
చివరిగా
‘ క ‘ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టమే. ఓటీటీలో అయితే ఓకే ఓకేగా అనిపిస్తుంది. థియేటర్లలో చూడాలంటే చాలా ఓపిక ఉండాలి.
రేటింగ్:2/5