టాలీవుడ్ ప్రేక్షకులను మహానటి, సీతారామం సినిమాలతో విపరీతంగా ఆకట్టుకున్న దిల్కర్ సల్మాన్.. తాజా మూవీ లక్కీభాస్కర్. దీపావళి కానుకగా థియేటర్లలో ఈ సినిమాల్లో రిలీజ్ చేయనున్నారు. ఇక సినిమా మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తుండగా.. వెంకీ అట్లూరి డైరెక్షన్లో నాగ వంశి ప్రొడ్యూసర్గ వ్యవహరిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాల్లో సచిన్ కేడ్కర్, టిను ఆనంద్ తదితరులు కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇక తాజాగా ఈ మూవీ ప్రీమియర్ షోలు రిలీజ్ చేశారు మేకర్స్. ఇంతకీ మూవీ ఎలా ఉంది.. లక్కీ భాస్సర్కు అక్క్ కలిసొచ్చిందా.. లేదా.. రివ్యూలో చూద్దాం.
కథ:
స్టోరీ మొత్తం ముంబైలోని ఓ చిన్న సిటీ నుంచి ప్రారంభమవుతుంది. 1989 నుంచి 92 మధ్యలో జరిగే కథ ఇది. (భాస్కర్ కుమార్) దుల్కర్ సల్మాన్ మగధ బ్యాంకులో క్యాషియర్ గా వ్యవహరిస్తూ ఉంటాడు. ఇల్లంతా అప్పులు.. ప్రమోషన్ వస్తే కష్టాలు తీరుతాయని ఆరాటపడుతూ ఉంటాడు. ఎంత కష్టపడి పనిచేసిన ప్రమోషన్ మాత్రం భాస్కర్‌కు కలెక్టర్‌కు రాకుండా వేరే వారికి వస్తూ ఉంటుంది. దీంతో డబ్బు అవసరమై.. ఆంటోనీ (రాంకీ) అనే వ్యక్తి తో కలిసి బ్యాంక్ డబ్బులతో చిన్న చిన్న స్కామ్‌లు చేస్తూ ఉంటాడు. అంతా బాగానే నడుస్తుంది డబ్బులు బాగానే వస్తున్నాయి అనుకునే సమయానికి కొన్ని కారణాలతో అంత ఆపేస్తారు. అయితే అప్పటి నుంచి అసలు కథ ప్రారంభమవుతుంది. దిల్కర్ కు అసిస్టెంట్ మేనేజర్ గా ప్రమోషన్ వస్తుంది. కోట్లకు కోట్లు సంపాదన మొదలవుతుంది.. ఇంతకి భాస్కర్ కు సడన్‌గా అంత డబ్బు ఎలా వచ్చింది.. సిబిఐ వాళ్ళు ఎందుకు ఎంక్వైరీ చేశారు.. ఈ స్టోరీ బిగ్బుల్ హర్ష మెహ్రాకి.. భాస్కర్‌కి మధ్య లింక్ ఏంటి.. అనేది మిగతా స్టోరీ.
కథ విశ్లేషణ:
1992లో ముంబైలో జరిగిన హర్షద్ మహత స్కామ్ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. దీనిపై గతంలో వెబ్ సిరీస్ కూడా వచ్చింది. హర్షద్ మెహతా ప్రభుత్వానికి, స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళకి టోపీ పెట్టి కోట్లు సంపాదించాడు. ఒకవేళ ఆ హర్షద్ మెహతాని బ్యాంకులో పనిచేసే సాధారణ ఎంప్లాయ్ బురిడీ కొట్టిస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ లక్కి భాస్కర్ రూపొందింది. ఇక బ్యాంక్స్ లో ఎప్పటికప్పుడు చిన్న చిన్న స్కాములు జరుగుతూనే ఉంటాయి అవి న్యూస్‌లలో చూస్తాం. కానీ మనకు అర్థం కాదు. ఒకవేళ ఆ స్కామ్స్ ఎలా జరుగుతాయి.. అనేది అర్థమయ్యేలా చూపిస్తే ఎలా ఉంటుంది.
అసలు ఈ థాట్ ఏ భలే ఎక్సైటింగ్ గా ఉంది కదా. లక్కీ భాస్కర్ చూస్తున్నంత సేపు అదే ఫీల్ కలుగుతుంది. సిబిఐ వాళ్ళు లక్కీ భాస్కర్ ని అదుపులోకి తీసుకొని బ్యాంకు తీసుకువెళ్లి విచారణ ప్రారంభించడంతో సినిమా ప్రారంభమవుతుంది. కట్ చేస్తే మూడేళ్ల వెనకకు స్టోరీ వెళుతుంది. అసలు భాస్కర్ ఎవరు.. అతని ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటి.. అనేది లక్కీ భాస్కర్ ఆడియన్స్‌ను చేస్తూ చెబుతూ ఉంటాడు. అలాంటి భాస్కర్‌ను డబ్బు అవసరం ఎలా మార్చేసింది. ఇక చివరకు భాస్కర్ ఈ స్కామ్ నుంచి బయటపడతాడా.. లేదా.. అనేది సినిమాలో చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో పేరు భాస్కర్ హీరో అయిన ఆయన తోటి ఉండే ప్రతి క్యారెక్టర్ సినిమాలో మంచి రోల్ ప్లే చేస్తాయి.
ప్రతి పాత్ర వల్ల స్టోరీ మలుపు తిరుగుతూనే ఉంటుంది. ఈ పాత్రల గురించి చెప్పడం కంటే సినిమాలో చూస్తూనే ఎక్కువగా థ్రిల్ అవుతారు. ఇక సినిమాకు మైనస్ ఊటంటే.. స్టోరి అంతా బ్యాంక్, స్టాక్ మార్కెట్, షేర్స్ హవాలా లాంటి వాటి \చుట్టు తిరుగుతూ ఉంటుంది. ఇక వాటిపైన మినిమం అవగాహన అయినా లేకపోతే సినిమా అర్థం కాదు అనేది ఆడియన్స్ అభిప్రాయం. కొన్ని చోట్ల బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎందుకో అవసరానికి మించి లౌడ్నెస్ అనిపిస్తుంది. ఇక 1992లో హర్షద్ మెహత పోలిన పాత్రను పెట్టి.. హర్ష మెహరా అనే పేరుతో మూవీలో చూపించారు. కానీ ముఖాన్ని చూపించకుండా బ్యాలెన్స్ చేశారు. అయితే ప్రైవేట్ బ్యాంకులో ఎలాంటి స్కామ్‌లు ఉంటాయి అనేది మాత్రం సగటు ప్రేక్షకుడికి కూడా క్లియర్‌గా అర్థమయ్యే విధంగా సినిమాను చూపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
నటీనటుల పర్ఫామెన్స్:
సినిమాల్లో ప్రతి పాత్ర హైలెట్. దుల్కర్ సల్మాన్ భాస్కర్ పాత్రలో ఇమిడిపోయారు. ప్రతి సందర్భంలోనూ భాస్కర్ గెలవాలని సినిమా చూసే ఆడియన్స్ అనుకునేలా ఆయన నటించారు. ఇక భాస్కర్ భార్య సుమతిగా చేసిన మీనాక్షి చౌదరి నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నా భాస్కర్ రోల్ కారణంగా పాత్ర నడివి పెద్దగా లేదు. అయితే కొడుకు తండ్రి, పాత్రలు మాత్రం సినిమాకు ఎందుకు ఉన్నాయో అర్థం కాదు. ఇక ఆంటోనీ పాత్ర కథను మలుపు తిప్పుతుంది. ఇక బ్యాంకు మేనేజర్, భాస్కర్ ఫ్రెండ్, బార్ డాన్సర్, బిచ్చగాడు ఇలా ప్రతి పాత్రను డైరెక్టర్ వేరే లెవెల్లో హైలెట్ చేశారు. ప్రతి ఒక్కరూ వారి పాత్రలో ఇమిడిపోయి నటించారు.
టెక్నికల్‌గా:
ఇక టెక్నికల్ విషయానికి వస్తే డైరెక్టర్ టాలెంటును మెచ్చుకోక తప్పదు. రోజు మనం న్యూస్ పేపర్ లో చదివే స్కామ్ లను ఓ కల్పిత కథగా రాయడమే గ్రేట్ అంటే.. దాన్ని ప్రేక్షకులందరికీ అర్థమయ్యే విధంగా థ్రిల్లర్ల తెరకెక్కించడం అంటే సాధారణ విషయం కాదు. దానికి తగ్గట్టు సినిమాలో డైలాగ్స్ కూడా అందర్నీ ఆలోచింపచేసేలా తర్కెక్కించడు. సినిమాలో శ్రీమతి గారి పాట హైలైట్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే ఓకే. సినిమాటోగ్రఫీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక సెట్ చేస్తే నిర్మాణ విలువలు అర్థమవుతాయి. దీనికోసమే భారీగా డబ్బులు ఖర్చు చేసినట్లు కనిపిస్తుంది.
చివరిగా:
లక్కీ భాస్కర్ సినిమాను థియేటర్లో చూసిన ఆడియన్స్ చాలా వరకు ఎంటర్టైన్ అవుతారు.
రేటింగ్: 3.25/5