కోల్డ్ వార్ నేపథ్యంలో పవన్ నోట బన్నీ పేరు.. ఎంటర్టైన్మెంట్ కాదు.. అది ముఖ్యమంటూ..

గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్‌ జరుగుతున్న సంగతి చాలామందికి తెలుసు. మెగా – అల్లు ఫ్యాన్స్ మధ్య కూడా ఈ వార్ కొనసాగుతుంది. ఇక ఇటీవల కాలంలో చరణ్‌,బ‌న్నీ అయితే కలిసి కనిపించిందేలేదు. ఎడమొఖం, పెడముఖంగా చాలా కాలం నుంచి సంబంధాలు లేకుండా గడిపేస్తున్నారు. అయితే అప్పట్నుంచి వార్తలు వినపడటంతో.. 2024 సంక్రాంతిలో మెగా, అల్లు ఫ్యామిలి అంత కలిసి సంక్రాంతి జరుపుకుని ఆ వార్తలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. కాగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల క్రమంలో.. మళ్లీ కోల్డ్ వర్ తెరపైకి వచ్చింది. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి అల్లు అర్జున్ మద్దతు పలకడం, మెగా ఫ్యామిలీ నుంచి జనసేన అభ్యర్థుల వరకు ఎవ్వరు సహించలేకపోయారు.

Did Pawan kalyan Take A Dig At Allu Arjun?

ఈ పరిణామం తర్వాత బన్నీపై ఓపెన్ గానే మాటల దాడి మొదలుపెట్టారు. జనసేన నేతలు అల్లు అర్జున్ పై ఫైర్ అవుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. నాగబాబు, సాయి దుర్గా తేజ్ కూడా పరోక్షంగా అల్లు అర్జున్‌పై తమ అసహనాన్ని బయటపెట్టారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా కర్ణాటక పర్యటనలో ఇన్ డైరెక్ట్ గా బన్నీపై విమర్శలు కురిపించాడు. ఒకప్పుడు హీరోలు అడవులు పెంచే ప్రయత్నాలు చేసే వారిని.. ఇప్పుడు హీరోలు అడవులను నరికి స్మగ్లింగ్ చేసే పాత్రలో నటిస్తున్నారని.. నటుడిగా నాకు అలాంటి పాత్రలో నచ్చవంటూ చెప్పుకొచ్చాడు. ఇక సుకుమార్ భార్య ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో అతిథిగా పాల్గొన్న అల్లు అర్జున్ ఇష్టమైన వ్యక్తుల కోసం ఎక్కడికైనా వెళ్తా.. ఏదైనా చేస్తా అంటూ.. మరోసారి మెగా హీరోలను ఉద్దేశిస్తూ ఇన్ డైరెక్ట్ కామెంట్స్ చేశాడు.

ఎవరికి భయపడేదేలే.. తగ్గేదేలే.. అంటూ డైలాగ్ చెప్పి మెగా ఫాన్స్‌కు మరింత కోపాన్ని పెంచేశాడు. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీతో అస్సలు కలిసేది లేదన్నట్లుగా ఇన్ డైరెక్ట్ కామెంట్స్ చేశాడు బన్నీ. దీంతో ఓ పక్కన బన్నీ ఫ్యాన్స్.. మరో పక్కన పవన్, చరణ్ ఫ్యాన్స్ మధ్యన కోల్డ్ వార్ మొదలైంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ నోట‌ అల్లు అర్జున్ పేరు రావడం చర్చనీయాంశంగా మారింది. ఓ పొలిటికల్ ఈవెంట్లో పవన్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి అవసరం. రోడ్లు బాగు చేసుకుని ఉద్యోగ కల్పన జరిగేలా చూసుకోవాలి. అప్పుడే మనం మన ఫేవరెట్ హీరో మూవీ చూడగలమంటూ కామెంట్స్‌ చేశారు. చిరంజీవి, బాలకృష్ణ, తారక్‌, మహేష్ బాబు , అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా హీరోలు అందరూ నాకు ఇష్టమని.. నేను అందరూ బాగుండాలని కోరుకుంటా.

Ram Charan, Allu Arjun send congratulatory wishes to Pawan Kalyan "Garu"  over his win in elections – ThePrint – ANIFeed

ముందు వినోదం కాదు.. అభివృద్ధి ముఖ్యం అంటూ చెపుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ నోటా స్టార్ హీరోల అందరి పేర్లతో.. బన్నీ పేరు కూడా రావడం అల్లు అర్జున్ అభిమానులకు ఆనందాన్ని కలిగించింది. మీటింగ్ లో పాల్గొన్న యువతలో సందడి నెలకొంది. నేను ఏ హీరోతో పోటీపడిను. నాకు అందరు ఇష్టమే అనడంతో అల్లు అర్జున్తో తనకు విభేదాలు లేవని పవన్ కళ్యాణ్ ఇన్ డైరెక్ట్ గా చెప్పేసారంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక త్వరలో ప్రసారం కానున్న అన్ స్టాపబుల్ సీజన్ 4లో అల్లు అర్జున్ పాల్గొననున్నాడట. మెగా హీరోలలో నెలకొన్న విభేదాలపై బన్నీ.. బాలకృష్ణతో ముచ్చటంచనున్నారు అని దీనిపై క్లారిటీ రానుందని సమాచారం.