బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ కూతురుగా స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపైర్ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. 1987 మార్చి 3న ముంబైలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. 2010లో తీన్ పత్తి సినిమాతో క్యారెట్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తర్వాత లవ్ కా ది ఎండ్ సినిమాతో హీరోయిన్గా మారింది. అయితే ఆమెకు బ్రేక్ ఇవేన్ వచ్చిన సినిమా మాత్రం 2013లో రిలీజ్ అయిన ఆషికి2. ఈ సినిమాలో గాయని పాత్రతో విపరీతమైన పాపులారిటి దక్కించుకున్న శ్రద్ధా కపూర్.. తన నటనకు ఫిలింఫేర్ అవార్డును అందుకుంది. తర్వాత హైదర్, ఏక్ విలన్, ఏబిసిడి, భాగి, స్త్రీ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ ఇమేజ్ను సొంతం చేసుకుంది.
యాక్టింగ్, సింగింగ్ సహా ఎన్నో కళలతో మల్టీ టాలెంటెడ్ బ్యూటీగా క్రేజ్ సంపాదించుకున్న శ్రద్ధ.. తాజాగా స్త్రీ 2 సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేసింది. ప్రభాస్, షారుక్, సల్మాన్, అమీర్ ఖాన్, సన్నీ డియోల్ లాంటి స్టార్ హీరోలకు మాత్రమే సాధ్యమైన రేర్ రికార్డును బ్రేక్ చేసింది. తెలుగులో ప్రభాస్ హీరోగా నటించిన సాహోలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అంతే కాదు ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ లోను అదరగొట్టిన శ్రద్ధ.. సోషల్ మీడియా వేదికగాను భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఏకంగా తన ఇన్‌స్టాలో 93.6 మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకుంది.
ఇక శ్రద్ధకు.. చిరంజీవితో మంచి బాండ్ ఉందట. అయితే శ్రద్ధ, చిరు మధ్యన ఉన్న సంబంధం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. శ్రద్ధ తండ్రి శక్తి కపూర్ బాలీవుడ్ లో నెంబర్ వన్ విలన్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆయన చిరంజీవి నటించిన యుద్ధభూమి సినిమాలో విలన్ పాత్రలో ఆకట్టుకున్నాడు. అలానే వెంకటేష్ కలియుగ పాండవులు సినిమాలోను ఆయన కనిపించారు. అయితే చిరు నటించిన పలు హిందీ రీమిక్స్ సినిమాల్లో ఆయనను ఢీకొట్టే విలన్ పాత్రలో శక్తి కపూర్ మెప్పించారు. ఈ క్రమంలో చిరంజీవి ఫ్యామిలీతో శ్రద్ధా కపూర్ ఫ్యామిలీకి మంచి బాండ్ ఏర్పడింది. ఇందులో భాగంగానే వీళ్లు ఎప్పటికప్పుడు పార్టీలలో కలుసుకుంటూ రిలేషన్‌ను అలానే మైంటైన్ చేస్తున్నారు.