త్రిష ఫేవరెట్ హీరోయిన్స్ ఎవరో తెలుసా..?

నాలుగు పదుల వయసులోనూ ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ బ్యూటీగా దూసుకుపోతుంది త్రిష. సౌత్ ఇండస్ట్రీలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. కెరీర్‌లో చిన్న చిన్న పాత్రల్లో నటించినా.. మెల్లమెల్లగా నటనలో తన సత్తా చాటుకుంటూ స్టార్ హీరోయిన్గా ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. చెన్నైకి చెందిన ఈ సోయగం. 1983 మే 4న జన్మించింది. చదువు పూర్తి చేసుకుని మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన త్రిష.. 1999లో మిస్‌ సేలం, మిస్ మద్రాస్ పోటీల్లో పాల్గొని సక్సెస్ అందుకుంది.

Ivana, tamil actress, cute HD phone wallpaper | Pxfuel

2001లో మిస్ ఇండియా పోటీల్లో బ్యూటిఫుల్ స్మైల్ అవార్డును దక్కించుకుంది. ఈ క్రమంలోనే ప్రశాంత్, సిమ్రాన్ జంటగా నటించిన జోడి మూవీలో సిమ్రాన్ స్నేహితురాలుగా అవకాశాన్ని దక్కించుకుంది. తర్వాత అమీర్ డైరెక్షన్లో వచ్చిన మౌనం పసితే సినిమాలో హీరోయిన్గా ఆకట్టుకుంది. అలా తెలుగులో అవకాశాలు దక్కించుకుని ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. అతడు, వర్షం ,కృష్ణ, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, స్టాలిన్, బుజ్జిగాడు ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో తన సత్తా చాటుకుంది. సీనియర్ హీరోలు నాగార్జున నుంచి వెంకటేష్ వరకు దాదాపు అందరితోనూ నటించి మెస్హ‌రైజ్ చేసింది.

Anushka class to Nitya Menon - ManaTeluguMovies.net

పలు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ తన సత్తా చాటుకుంది. ఇక ప్రస్తుతం కోలీవుడ్ పై దృష్టి సారించిన త్రిష.. అక్కడ వరుస సినిమాలో నటిస్తుంది. తెలుగులోనూ మెగాస్టార్ హీరోగా నటిస్తున్న విశ్వంభర హీరోయిన్గా కనిపించనుంది. ఇదిలా ఉంటే త్రిష ఇండస్ట్రీలో తన అభిమాన హీరోయిన్స్ ఎవరు అనే విషయాన్ని స్వయంగా ఓఈవెంట్ లో వెల్లడించింది. త్రిష మాట్లాడుతూ ఆమెకు అనుష్కా, నిత్యామీనన్, ఇవానా, తుషార విజయన్‌, సాయి పల్లవి, రష్మిక మందన అంటే చాలా ఇష్టమంటూ చెప్పుకొచ్చింది. త్రిష చేసిన కామెంట్స్ ప్రస్తుతం తెగ‌ వైరల్‌గా మారుతున్నాయి.

Rashmika in Sai Pallavi film?