బుల్లితెరపై స్టార్ యాంకర్ గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు ప్రదీప్ మాచరాజు. ఒకప్పుడు ఆయన వరస షోలు చేసి ఫుల్ క్రేజ్ సంపాదించుకోవడంతో పాటు.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. అలాగే పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి తన సత్తా చాటుకున్నాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరోగా మారాడు. అయితే ఈ సినిమా రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నా.. ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయింది.
దీంతో మళ్లీ బుల్లితెరపై షోలు చేస్తూ బిజీ అయ్యాడు. కారణం ఏంటో తెలియదు కానీ.. గత కొద్ది కాలంగా ప్రదీప్ ఏ టీవీ షోలను కనిపించడం లేదు. సోషల్ మీడియాలోనూ సందడి చేయడం లేదు. అలా ప్రదీప్ కనిపించకపోవడంతో అభిమానులంతా ఆందోళనతో పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో తాజాగా ప్రదీప్ తన సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ అందరికీ ఒక్కసారిగా బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. గుడ్ న్యూస్‌ను ప్రకటించాడు. ఎట్టకేలకు తన రెండో సినిమాను అనౌన్స్ చేస్తూ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా అభిమానులతో షేర్ చేసుకున్నాడు.
ఈ సినిమాకు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి టైటిల్ ని పెట్టడం విశేషం. జబర్దస్త్ ఫేమ్ దీపిక పిల్లి హీరోయిన్గా నటిస్తుండగా.. నితిన్, భరత్ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో ప్రదీప్ మాచరాజు షేర్ చేసిన పోస్ట్ నెటింట తెగ వైరల్ గా మారింది. అది చూసిన వారంతా మేము అనుకున్నట్టుగానే కొత్త సినిమాతో సడన్ సర్ప్రైజ్ ఇచ్చావే అంటూ.. మీ నుంచి ఈ సినిమాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు.. ఇది నిజంగానే బిగ్ షాక్ అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.