బాలయ్య సినీ కెరీర్‌లో ఎన్నో మైల్డ్ స్టోన్లను అధిగమించిన సంగతి తెలిసిందే. కానీ ఆయన సినీ కెరీర్‌లో అఖండ ఎప్పటికీ ప్రత్యేకం. ఈ సినిమా తర్వాత బాలయ్య మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. దిశ తిరిగింది. అప్పటివరుకు ఫ్లాప్‌లతో కొట్టుమిట్టాడిన బాలయ్య ఒక సారిగి గ్రాండ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు యంగ్ డైరెక్టర్ కు అవకాశాలు ఇస్తూ సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్న బాలయ్య.. ఎప్పుడు చూడడంత పిక్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. సింహా, లెజెండ్ లాంటి సంచలన సక్సెస్ల తర్వాత బాలకృష్ణ నటించిన అన్ని సినిమాలు వరుసగా ఫ్లాప్స్ కావడంతో ఇక బాలయ్య సినీ కెరీర్ అయిపోయింది. పూర్తిస్థాయిలో రాజకీయాల్లో రాణించడం మంచిదని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అలాంటి క్రమంలో బోయపాటి అఖండతో బాలయ్యకు ఇండస్ట్రియల్ హిట్ ఇచ్చాడు.
గతంలో బాలయ్య నటించిన ఎన్నో సినిమాలు కమర్షియల్ సక్సెస్ అందుకున్నా.. అఖండ సినిమా తర్వాత ఆయన నటించిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడం విశేషం. ఈ క్రమంలోనే అఖండ సీక్వెల్.. అఖండ 2 తాండవంను బోయపాటి శ్రీను అనౌన్స్ చేశారు. ఇటీవల గ్రాండ్గా ఈ సినిమాను ప్రారంభించారు. ముహూర్తం షార్ట్ ను బాలయ్య కూతురు బ్రాహ్మణి క్లాప్ కొట్టగా.. పవర్ ఫుల్ డైలాగ్తో మొదలుపెట్టారు. బాలయ్య చెప్పిన ఈ డైలాగ్ ప్రస్తుతం నెటింట తెగ వైరల్‌గా మారింది. ఉగ్ర భూతాలు భూమిపై చూస్తూ ఊరుకోవడానికి.. ఈనెల అసురులది కాదురా.. ఈశ్వరుడిది. పరమేశ్వరుడిది. కాదని తాకితే.. జరగబోయేది తాండవం.. అఖండ తాండవం అంటూ పవర్ ఫుల్ డైలాగ్ ను వినిపించాడు. దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్ కూడా రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇక ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించనున్నాడు. కాగా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో బోయపాటి తెరకెక్కించనున్నాడు. ఇక గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా సనాతన ధర్మ పరిరక్షణ గురించి ఎన్నో చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అఖండ 2 ఇదే కథంశంపై తెరకెక్కనుందని.. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో బోయపాటి అందరికీ నచ్చే విధంగా రూపొందించనున్నాడని సమాచారం. ఈ ఏడాది చివర్లో షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని.. వచ్చేయడాది ద్వితీయార్థం నుంచి సినిమా షూట్ ను ప్రారంభిస్తారట. ప్రస్తుతం బోయపాటి స్టోరీ లైన్ లీక్ అవడంతో అభిమానులంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోసారి బాలయ్య, బోయపాటి కాంబో బ్లాక్ బస్టర్ పక్క అంటూ.. పాన్ ఇండియా లెవెల్ బ్లాస్ట్ కాయమంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.