మొదట మోడల్‌గా తన కెరీర్ ప్రారంభించి బాలీవుడ్ లో పాలు సినిమాల్లో నటించిన తర్వాత టాలీవుడ్‌కు పరిచయమైంది అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాగూర్. తెలుగులో సీతారామం సినిమాతో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తన అందంతో లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. సీతామహాలక్ష్మిగా.. అచ్చ తెలుగు ఆడపిల్లల కనిపించి తన కట్టుబొట్టుతో కట్టిపడేసింది. ఈ క్రమంలో అమ్మడికి ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే వచ్చిన అవకాశాలు అన్నిటికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా.. ఆచితూచి అడుగులు వేస్తుంది మృణాల్ ఠాగూర్.
ఇటీవల నాచురల్ స్టార్ నాని హీరోగా హాయ్‌నాన్న సినిమాలో నటించి మరోసారి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాకు ఏకంగా ఫిలింఫేర్ అవార్డు కూడా దక్కించుకుంది. తర్వాత విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించింది. ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచినా అమ్మడి క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఆయనప్పటికి సినిమాకు చిన్న బ్రేక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది. కుర్ర కారును తన గ్లామర్ ట్రీట్‌తో కవ్విస్తుంది. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ హ్యాపీ బర్త్‌డే అమేజింగ్ పర్సన్.. రేపు చెన్నైలో కలుసుకుందాం. నీ బర్త్‌డేను జరపడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్న.. ఆగలేకపోతున్నా అంటూ షేర్ చేసుకుంది.
అయితే ఆ వ్యక్తితో అంత చనువుగా ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. ఇలాంటి ట్యాగ్స్ ఇవ్వడంతో ప్రస్తుతం పోస్ట్ నెటింట తెగ వైరల్ గా మారింది. దీంతో అమ్మడి పక్కన ఉన్న వ్యక్తి ఎవరు.. ఎందుకు మృణాల్ అంతగా ఎగ్జైట్ అవుతుంది అనే సందేహాలు ప్రేక్షకుల్లో మొదలైపోయాయి. అయితే ఆ వ్యక్తి ఎవరో తెలియదు కానీ.. తను మృణాల్ ఠాగూర్ బాయ్ ఫ్రెండ్ అని.. అందుకే తనతో కలిసి ఉండడానికి అంతగా ఎక్సైట్ అవుతుందని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈముద్దుగుమ్మ త్వరలోనే సినిమాల్లో కం బ్యాక్ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని.. భారీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ లు అందుకోవాలని ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.