RC16 కు రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన జాన్వి.. ఒక్క రోజుకు ఎంత తీసుకుంటుంది అంటే..?

దివంగత అతిలోక‌సుందరి శ్రీదేవి కుమార్తెగా జాన్వీ కపూర్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ అమ్మ‌డు ఇప్పటికే యూత్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. బాలీవుడ్ లో చేసిన సినిమాలు ఫ్లాప్ అయినా.. అమ్మడి క్రేజ్ మాత్రం కొంచమైనా తగ్గలేదు. కేవలం శ్రీదేవి కూతురు గా మాత్రమే అమ్మడికి ఆ క్రేజ్‌ రాలేదు. అందం, అభినయంతో పాటు టాలెంట్‌తోను ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కాగా ఈ క్రమంలో టాలీవుడ్ లో ఎన్టీఆర్ దేవర సినిమాలో నటించిన ఛాన్స్ కొట్టేసింది జాన్వీ. ఇక‌ ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే అమ్మడి లుక్ బయటకు వచ్చి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో పాటు ఈ సినిమా నుంచి వచ్చిన చుట్టుమల్లె, దావుద్ది సాంగ్స్ లో ఎన్టీఆర్ తో తలపడి డాన్స్ చేసింది.

Devara's Second Single: Musical Teaser Goes Viral Ahead of August 5 Release

సాధారణంగా ఎన్టీఆర్‌తో మ్యాచ్ చేసే డ్యాన్స్ చేయాలంటే హీరోయిన్స్‌కు పెద్ద తలనొప్పి. తార‌క్‌తో హీరోయిన్స్ పోటీ పడలేరు. కాబట్టి సింపుల్ స్టెప్స్‌తో ముగించేస్తారు. కానీ దేవర‌లో మాత్రం ఇద్దరు కష్టతరమైన స్టెప్పులతో పోటీపడి మరీ డాన్స్ వేశారు. ఇక జాన్వి డ్యాన్స్ చూసిన తర్వాత అభిమానుల సైతం ఆశ్చర్యపోయారు. అయితే ఇప్పటికీ ఇంకా సినిమా కూడా రిలీజ్ కాకముందే హీరోయిన్స్ లో జాన్వి ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో అవకాశాలు క్యూ క‌డుతున్నాయి. దేవర షూటింగ్ జరుగుతున్న క్రమంలోనే బుచ్చిబాబు సన్న‌ డైరెక్షన్‌లో రాంచరణ్ హీరోగా తెర‌కెక్క‌నున్న ఆర్సి16లో అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం అమ్మడు భారీగా రెమ్యున‌రేషన్ తీసుకుంటుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ఒక్క సినిమా కోసం దాదాపు రూ.8 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట.

 

కేవలం దేవరకు రూ.4 కోట్ల రెమ్యున‌రేషన్ పుచ్చుకున్న జాన్వి.. టాలీవుడ్లో ప్రస్తుతం ఏర్పడిన డిమాండ్ రిత్య‌ డబ్బులు రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తుందని వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే నాని దసరా డైరెక్టర్ శ్రీకాంత్ డైరెక్షన్‌లో మరో సినిమాలో నటించనుంది జాన్వి. ఇక ఈ సినిమాకు కూడా దాదాపు రూ.8 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని.. అంత ఇచ్చుకోలేమని ఆ టీమ్‌ వెనుతిరిగినట్లు సమాచారం. ఇలా మొదట్లోనే జాన్వి ఈ రేంజ్‌లో రెమ్యూనరేషన్ పెంచేస్తే.. ఫ్యూచర్‌లో అవకాశాలు ఉండవని విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక బాలీవుడ్‌లో జాన్వికి రెండు కోట్లు మించిన రిమేనరేషన్ ఉండదు. కానీ ఇక్కడ మాత్రం ఫ్యుజులు ఎగిరిపోయారు రేంజ్‌లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ అందరికీ షాక్ ఇస్తుంది.