భారత స్టార్ క్రికెటర్.. ఆల్ రౌండర్ హార్దిక్ పాండే మాజీ భార్య మోడల్ నటాషా స్టాంకోవిక్ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల హర్ధిక్‌కు డివోర్స్ ఇచ్చిన నటాషా తర్వాత సెర్బియాకు వెళ్ళిపోయింది. దాదాపు రెండు నెలల పాటు సెర్బియాలోనే ఉండిపోయిన ఈ అమ్మడు.. తాజాగా ముంబైకి వచ్చేసింది. అయితే ఆమెతో పాటు తన బాయ్ ఫ్రెండ్ అలెగ్జాండర్ కూడా ఉండడం విశేషం.
ప్రస్తుతం నటాషా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి మొంబయి వీధిలో తెగ ఎంజాయ్ చేస్తుంది. అమ్మడు బాయ్ ఫ్రెండ్‌తో కటిసి చెక్కర్లు కొడుతున్న వీడియో నెటింట తెగ వైరల్ గా మారుతుంది. వైట్ జాకెట్ వేసుకున్న నటాషా ఓ జిమ్ వద్ద ఫోటోగ్రాఫర్లకు స్టిల్స్ ఇచ్చి.. తర్వాత తానే కార్ డ్రైవ్ చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. హార్దిక్ నుంచి విడిపోయిన నటాషా.. సెర్బియాకు మక్కం మార్చేసింది. అక్కడే తన కుమారుడు అగస్త్య నాలుగో బర్డెను కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య గ్రాండ్ లెవెల్లో నిర్వహించింది.
ఆ ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది. తర్వాత తన లైఫ్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ వస్తున్న నటాషా జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలు అంటూ కొన్ని కొటేషన్లు కూడా అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఇప్పటికే తన కుమారుడిని తండ్రి హార్దిక్ వద్ద విడిచిపెట్టిందని టాక్. దీనికి కారణం కృనాల్ పాండ్యా నివాసంలో జరిగిన గణేష్ పూజ ఉత్సవాల్లో అగస్త్య ఉన్న వీడియోస్ వైరల్ గా మారడమే.