రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది కాలంగా హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నా వార్తలలో టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ఎఫైర్ న్యూస్ ఒకటి. అతడు తనను మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఇది పెద్ద వివాదంగా మారింది. రోజురోజుకు మరిన్ని మలుపులు తిరుగుతూ నెట్టింట చర్చినీయాంశంగా కొనసాగుతున్న ఈ వివాదంలో ఎంతోమంది సెలబ్రిటీల పేర్లు కూడా బయటకు వచ్చాయి. అలా లావణ్య.. బిగ్‌బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ పేరు కూడా బయటకు తీసుకురావడం గమనార్హం. ఈ క్రమంలో తాజాగా ఆర్జే శేఖర్ భాష దీనిపై రియాక్ట్ అయ్యాడు.
ఇక లావణ్య మొదటి యంగ్ హీరో రాజ్ తరుణ్ పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తనను శారీరకంగా వాడుకొని మోసం చేశాడంటూ.. మరో హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకొని తనను వదిలేసాడంటూ విమర్శలు చేసింది. అయితే తర్వాత ఈ కేసులో ఎన్నో ఊహించని మలుపులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో రాజ్ తరుణ్ ప్రియురాలుగా చెబుతున్న లావణ్య.. చాలా మంది సెలబ్రేట్ పేర్లను రివిల్ చేసింది. అందులో ముఖ్యంగా బిగ్‌బాస్ ఫేమ్ అరియానా గ్లోరీతో రాజ్‌తరుణ్ ఎఫైర్ పెట్టుకున్నాడని.. వీళ్ళిద్దరి మధ్య ఎన్నో జరిగాయని.. అదే సమయంలో శారీరక సంబంధం కూడా ఏర్పడింది అంటూ చెప్పుకొచ్చింది.
అలా తను ప్రెగ్నెంట్ కూడా అయిందని బిగ్‌బాస్‌లో ఉన్న సమయంలో చాలా సన్నగా ఉన్న అరియానా బయటకు వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ తో ప్రెగ్నెంట్ కావడం వల్లే.. లావుగా అయిందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే రాజ్ తరుణ్ కేసులో లావణ్య చేసిన ఈ విమర్శలపై ప్రముఖ ఆర్జే శేఖర్ భాష రియాక్ట్ అవుతూ.. లావణ్యగురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ కేసులో శేఖర్ బాషా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి లావణ్య నే అసలు మంచిది కాదని.. చాలా విషయాల్లో ఆమె అబద్దాలు చెప్తుందంటూ.. చాలామందికి డ్రగ్స్ కూడా అలవాటు చేసింది ఆ అమ్మాయి అంటూ వివరించాడు. తాజాగా ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడిన శేఖర్ బాష.. అరియాన ప్రెగ్నెంట్ అని లావణ్య అంటుంది. ఆమె ప్రెగ్నెంట్ అయింది అందుకే లావైందని లావణ్య చెప్తుంది.
ఈ విషయంపై నేను అర్యానాతో కూడా చర్చించా. అప్పుడు ఆమె మాట్లాడుతూ.. ఆడపిల్లకు న్యాయం చేయండి అంటూ రోడ్డు పైకి వచ్చింది. ఇప్పుడు మరో ఆడపిల్ల గురించి అలా నీచంగా ఎలా నిందలు వేస్తుందంటూ బాధపడిందని.. శేఖర్ భాష వివరించాడు. అలాగే నేను లావు అవ్వడానికి.. ప్రెగ్నెన్సీకి అసలు సంబంధం ఏంటి..? సినిమాల కోసం నేను లావయ్య. ఆ అమ్మాయికి అసలు బుద్ధి ఉందా..? అంటూ ప్రశ్నించిందని.. అలాగే త్వరలో నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అంటూ చెప్పిందని.. శేఖర్ భాషా వివరించాడు. ఇలా లేనిపోని నిందలు వేస్తే ఓ అమ్మాయి ఫ్యూచర్ ఏమవుతుంది..? అంటూ లావణ్య పై ఫైర్ అయ్యాడు. ప్రస్తుతం శేఖర్ భాషా చేసిన కామెంట్స్ నెటింట వైరల్ అవుతున్నాయి.