టాలీవుడ్ ప్రేక్షకులకు స్టార్ యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందం, మాటతీరుతో పాటు.. ఎనర్జిటిక్ యాంకరింగ్ తో లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న సుమా.. వెండితెర, బుల్లితెర అని తేడా లేకుండా వాళ్ళు సినిమాల్లో నటిస్తూనే యాంకర్ గాను కొనసాగుతుంది. చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు ఏదైనా ఈవెంట్ చేయాలంటే మేకర్స్‌కు టక్కున గుర్తుకు వచ్చే పేరు యాంకర్ సుమ. ప్రతి సినిమా ఈవెంట్‌లోను, బుల్లితెర షోలోను.. యాంకర్‌గా వ్యవహరిస్తూ.. సందడి చేసే ఈ అమ్మడు పలు బ్రాండ్స్‌కు ప్రమోటర్‌గా కూడా వ్యవహరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా సుమా చేసిన రియల్ ఎస్టేట్ యాడ్ అమ్మడుకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. దీని మూలంగా సుమ అనుకొని వివాదాల్లో ఇరుకోవాల్సి వచ్చింది.
రాకి ఎవెన్యూస్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీకి తను ప్రమోషన్స్ చేసింది. తమ వెంచర్స్‌కు సుమాతో ప్రమోట్ చేయించిన యజమానులు.. కస్టమర్లను మోసం చేయడంతో ఆమె వివాదాల్లో చిక్కుకున్నట్లయింది. తక్కువ ధరకే ఇల్లు అంటూ.. సుమ యాడ్స్‌లో నటించడం రాజీవ్ కనకాల కూడా సుమాతో కలిసి ప్రమోట్ చేయడంతో చాలామంది ఫ్లాట్స్ కొనుగోలు చేశారు. తక్కువ ధరకే ఇల్లు ఇస్తామని మధ్యతరగతి కుటుంబాలకు ఆశ చూపించి.. దాదాపు రూ.88 కోట్లు డబ్బులు స్వాహా చేసుకుని.. ఇంటిని హ్యాండ్ ఓవర్ చేయకుండా బోర్డ్ ఎత్తేశారు నిర్వాహకులు. దీంతో రాఖీ ఎవెన్యూస్ లో డబ్బు కట్టిన బాధితులంతా తమకు న్యాయం చేయాలంటూ రోడ్డెక్కారు. పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చి రోడ్డుపై ప్లక్కార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్నారు.
పలువురు బాధితులు మీడియాతో మాట్లాడుతూ.. యాంకర్ సుమ ప్రచారం చేయడం కారణంగానే మేము అవెన్యూస్‌లో ఇల్లు కొన్నామని.. పిల్లల ఫీచర్ కోసం దాచిపెట్టిన డబ్బంతా పోగుచేసి ప్లాట్ కొనుగోలుకు ఖర్చు చేస్తామని.. కనుక సుమనే మాకు ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికే రియల్ ఎస్టేట్ మోసాల నెలవుగా మారిన సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీస్ ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో సుమ కూడా ఇలాంటి విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడు సుమ కూడా అదే రేంజ్ లో విమర్శలను చెవి చూడాల్సి వస్తుంది. కాగా ఇటీవల టీవీ షోలకు బ్రేక్ ఇచ్చిన సుమ.. కేవలం బుల్లితెరపై సుమ అడ్డ పేరుతో ఒక షోను మాత్రమే చేస్తుంది. ఈ షో వేదికగా సెలబ్రిటీలతో గేమ్స్ ఆడిస్తూ.. పలు టీవీ ఈవెంట్స్‌లోను ఈ అమ్మడు సందడి చేస్తుంది.