అక్కినేని ఫ్యామిలీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే గత కొంతకాలంగా అక్కినేని ఫ్యామిలీకి అసలు కలిసి రావడం లేదన సంగతి తెలిసిందే. ఈ హీరోల సినీ కెరీర్‌తోపాటు.. నాగార్జున కొడుకుల ఇద్దరి పర్సనల్ లైఫ్ లో కూడా ఎన్నో సమస్యలు తలెత్తాయి. నాగచైతన్య గతంలో హీరోయిన్ సమంతకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక అఖిల్ కూడా శ్రేయ భూపాల్‌ను ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత బ్రేకప్ జరిగిన సంగతి తెలిసిందే. ఇలా ఇద్దరు కొడుకులు మ్యారేజ్ విషయంలో ఫెయిల్ అయ్యారు.
ఈ క్రమంలో నాగచైతన్యకు ఎలాగైనా మరోసారి వివాహం చేయాలని నాగార్జున ఫిక్స్ అయ్యాడట. ఇందులో భాగంగానే నేడు అతి కొద్ది మంది సమక్షంలో నాగచైతన్య ఎంగేజ్మెంట్ జరుగుతుందని.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్త ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మరింది. ఇంతకీ పెళ్లికూతురు ఎవరు అనే సందేహాలు చాలా మందిలో మొదలైపోయి ఉంటాయి. ఇప్పటికే నాగచైతన్య, నటి శోభిత ధోళిపాళ్లతో ప్రేమలో ఉన్నారంటూ.. వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారంటే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
నేడు ఆ వార్తలు నిజం చేస్తూ ఈ జంట ఒకటి కాబోతున్నారని సమాచారం. ఇరు కుటుంబాల అంగీకారంతో నాగచైతన్య, శోభిత అతి కొద్దిమంది సమక్షంలో నిశ్చితార్థంతో ఒకటి కాబోతున్నారట. ఈ కార్యక్రమానికి మీడియాను అనుమతించలేదు. కార్యక్రమం తర్వాత నిశ్చితార్థ విషయాన్ని అక్కినేని ఫ్యామిలీ అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారని.. నూతన జంట ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఈ విషయాన్ని అందరితో పంచుకోబోతున్నారని సమాచారం. త్వరలోనే నాగ్ కోడలుగా శోభిత మారనుందట. ఇక 2016లో శోభిత ఫెమినా మిస్ ఎర్త్ గా అవార్డ్ గెలుచుకుంది. గూఢాచారి, మేజర్, పొనియన్‌సెల్వన్, కురుప్ లాంటి సినిమాలతో హీరోయిన్గా నటించి మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది.