ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమాలు రిలీజ్ అవుతున్నా.. అగ్ర హీరోల సినిమాలన్నీ భారీ బడ్జెట్‌లో తెరకెక్కుతున్నా.. వాటికి పెట్టిన పెట్టుబడులు రాబట్టుకోవాలంటే అతితక్కువ టైంలోనే ఎక్కువ ధియేటర్లలో రిలీజ్ చేస్తే.. బయటపడిపోతామనే ఆలోచనలో నిర్మాతలు ఉండిపోతున్నారు. ఈ క్రమంలో విడుదలైన రెండు మూడు వారాలకి సినిమాలు థియేటర్లలో ఆడే టైం ముగిసిపోతుంది. వెబ్ సైట్‌లో సినిమాలు అప్లోడ్ అవుతుండడంతో.. మరికొన్ని కారణాలతో ప్రస్తుత పరిస్థితులు ఇలా ఉన్నాయి. కానీ గతంలో మాత్రం థియేటర్స్ లో సినిమా రిలీజ్ అయింది అంటే.. ఆ సినిమా హిట్ టాక్ వస్తే సంవత్సరాలు తరబడి సినిమా ఆడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. థియేటర్లకు ఊళ్ళ నుంచి ఎడ్ల బండ్లు కట్టుకొని మరి సినిమాలకు వచ్చి ఎగబడి చూసేవాళ్ళు. టాలీవుడ్‌లో శతదినోత్సవాలు, సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ వేడుకలు గతంలో ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉండేవి. కొన్ని సినిమాలు ఏడాదికి పైగా ఆడి రికార్డ్ సృష్టించేవి. అలా టాలీవుడ్‌లో థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడి రికార్డ్ సృష్టించిన సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం.
లెజెండ్:
బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్లో 2014లో వచ్చిన లెజెండ్.. ఏకంగా వేయి రోజులకు పైగా ఆడి రికార్డ్ సృష్టించింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో లెజెండ్ 2014 నుంచి ఏకంగా 2017 వరకు థియేటర్లో రన్ అవుతూనే ఉంది. దీనికి సంబంధించిన స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది.
మగధీర :
రాజమౌళి – రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మగధీర సినిమా గతంలో ఏ రేంజ్ లో రికార్డు క్రియేట్ చేసిందో తెలిసిందే. 2009లో రిలీజ్ అయిన ఈ సినిమా కర్నూల్ విజయలక్ష్మి థియేటర్‌లో ఏకంగా వెయ్యి రోజులు ఆడింది.
పోకిరి:
మహేష్ బాబు – పూరి జగన్నా డైరెక్షన్‌లో వచ్చిన పోకిరి సినిమా అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర ఎన్నో సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్‌లోనే సినిమా మైలురాయిగా నిలిచిపోయింది. ఓ థియేటర్‌లో ఈ సినిమా ఏకంగా 580 రోజులు రన్ అయింది.
మంగమ్మగారి మనవడు:
కోడి రామకృష్ణ డైరెక్షన్లో బాలయ్య హీరోగా నటించిన మంగమ్మగారి మనవడు.. 1984లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా హైదరాబాద్ తారకరామా థియేటర్లో ఏకంగా 565 రోజులు నిరంతరాయంగా ప్రదర్శితమైంది.
మరోచరిత్ర :
కమలహాసన్ నటించిన మరోచరిత్ర మూవీ అప్పట్లో రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా ధియేటర్లో ఏకంగా 556 రోజులు ఆడింది.
ప్రేమాభిషేకం:
దాసరి నారాయణరావు డైరెక్షన్‌లో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా తెరకెక్కిన మూవీ ప్రేమాభిషేకం. ఈ సినిమా పాటలతో అప్పట్లో రికార్డ్ సృష్టించింది. ఆ రోజుల్లోనే 533 రోజులు ధియేటర్లలో నిరంతరయంగా ఆడి రికార్డు క్రియేట్ చేసింది. అంతే కాదు ఎక్కువ థియేటర్లలో 300 రోజులకు పైగా ఈ సినిమా ఆడింది.
లవకుశ :
నందమూరి తారక రామారావు నటించిన లవకుశ సినిమాకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. 1963 లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లోనే ఏకంగా 469 రోజులు నిరంతరాయంగా ఆడి రికార్డ్ క్రియేట్ చేసింది.
ప్రేమ సాగరం:
తమిళ్ స్టార్ హీరో సింబు తండ్రీ టి. రాజేందర్ డైరెక్షన్లో తెరకెక్కిన ప్రేమ సాగరం మూవీ అప్పట్లో పెద్ద సంచలనం. ఈ సినిమా ఏకంగా 465 రోజులు ఆడింది.