కన్నడ హీరో రిషబ్ శెట్టి.. కాంతారా సినిమా రిలీజ్‌కు ముందు వరకు ఈ పేరు చాలామందికి తెలియదు. అయితే ఒక్కసారిగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అవ్వడంతో.. స్టార్ హీరోగా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న రిషబ్ శెట్టి.. తాజాగా నేషనల్ అవార్డు విన్నర్ రేంజ్‌కు ఎదిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ కన్నడ హీరో సక్సెస్ వెనుక ఎవరు ఉన్నారు అని అందరిలో సందేహాలు మొదలయ్యాయి. ప్రతి మగాడి విజయం వెనక ఓ మహిళ ఉంటుంది అని చెబుతూ ఉంటారు కదా.. అలా రిషబ్ శెట్టి సక్సెస్ క్రెడిట్ అంతా తన భార్య ప్రగతికే దక్కుతుందని ఇప్పటికే చాలాసార్లు వివరించాడు. ఈ విధంగా రిషబ్ భార్యపై తన ప్రేమను చాటుకున్నాడు. రిషబ్ ప్రధాన బలం తన భార్య, ఇద్దరు పిల్లలు అంటూ చెప్పుకొచ్చిన ఆయన.. వ్యక్తిగతంగానే కాదు.. వృత్తిపరంగా కూడా రిషబ్‌కు తన భార్య ఎంతగానో తోడుగా నిలిచిందని చెప్పుకొచ్చాడు.
ఇక వీరిద్దరి మధ్యన ప్రేమ ఎలా మొదలైందో ఒకసారి తెలుసుకుందాం. సాధారణంగా హీరోలు తమ ఇండస్ట్రీలో పరిచయం ఉన్న వారితో ప్రేమలో పడడం కామన్. కానీ.. ఒక అభిమానిని ప్రేమించి ఆమెనే వివాహం చేసుకోవడం చాలా రేర్ గా జరుగుతూ ఉంటుంది. రిషబ్ సెట్టి లైఫ్ లోను అదే జరిగింది. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన అమ్మాయితో ప్రేమలో పడిన రిషబ్.. రిక్కీ మూవీ దర్శకుడుగా వ్యవహరించారు. ఈ సినిమా సక్సెస్ మీట్ లో అందరు హీరోలతో సెల్ఫీల కోసం ఎగబడుతున్న క్రమంలో రిషబ్ అందమైన అమ్మాయిని చూశారు. ఇక ఆమె రిషబ్‌ను అలానే చూస్తూ ఉండిపోయిందట. దానిని గమనించిన రిషబ్.. మిమ్మల్ని ఎక్కడో చూశాను అంటూ పలకరించాడట. ఆ అమ్మాయి తన గ్రామం కేరాడికి చెందిన అమ్మాయి అని తెలుసుకున్న రిషబ్ ఫేస్బుక్ ద్వారా ఆమెతో పరిచయాన్ని పెంచుకున్నారు. అలా ప్రగతితో ప్రేమలో పడి 2017 లో ఆమెను వివాహం చేసుకున్నారు. అయితే మొదట వీరి పెళ్లికి ప్రగతి ఇంట్లో ఒప్పుకోలేదట.
రిషబ్ ఇంకా ఆర్థికంగా స్థిరపడలేదని.. రిజెక్ట్ చేశారట. అయితే ప్రగతి మాత్రం పట్టు పట్టి మరీ కుటుంబ సభ్యులను ఒప్పించి రిషబ్‌ను చేసుకుంది. ఇక ఐటి బ్యాక్ డ్రాప్ ఉన్న ప్రగతి బెంగళూరులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ పూర్తిచేసి.. సినీ రంగంపై దృష్టి సారించింది. డిజైనర్గా కెరీర్‌ను ప్రారంభించిన ఈ అమ్మడు కాంతర సినిమాకు కూడా పనిచేయడం విశేషం. కాంతార ప్రారంభ సన్నివేశంలో రాణి పాత్రలో ప్రగతి నటించి మెప్పించింది. ప్రస్తుతం రిషబ్ పలు సినిమాలకు ప్రొడ్యూసర్‌గానే కాదు.. దర్శకుడుగాను పనిచేస్తూ మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ప్రగతి కాస్ట్యూమ్ డిజైనర్ గా ఇండస్ట్రీలో రాణిస్తుంది. తన హస్బెండ్ సక్సెస్ కు కీ రోల్ ప్లే చేస్తూ మంచి పేరు సంపాదించుకుంటుంది. అయితే 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తాజాగా రిషబ్ శెట్టి ఉత్తమ నటుడుగా అవార్డు దక్కించుకున్న సంగతి తెలిసిందే.