సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగు పెట్టి స్టార్‌సెలబ్రిటీగా రాణించాలంటే అందం, నటనతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. అలా అదృష్టం లేకపోవడంతో ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్స్ అందం, అభినయం ఉన్న సినీ ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోతున్నారు. ఒకటి, రెండు సినిమాల్లో నటించినా.. ఆ సినిమాలు హిట్ అందుకున్న.. తర్వాత అవకాశాలు రాక ఇండస్ట్రీకి దూరమవుతున్నారు. అలా ఇప్పుడు మనం పై ఫోటోలో చూస్తున్న హీరోయిన్ కూడా అదే కోవకు చెందుతుంది. ఈ ముద్దుగుమ్మ తెలుగులో నటించింది ఒక్క సినిమాలోనే. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ అమ్మడు.. తర్వాత టాలీవుడ్ లో పెద్దగా కనిపించలేదు.
అయితే సౌత్ ఇండియా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఇక సౌత్ హైయెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్లలో ఒకటి. ఇప్పటికైనా ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. తనే హీరోయిన్ అనన్య. జర్నీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు.. శర్వానంద్, జై ,అంజలితో కలిసి నటించింది. ఈ సినిమాలో శర్వానంద్‌కు జంటగా మెరిసిన అనన్య ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయినా ఈ అమ్మడు తర్వాత ఊహించిన రేంజ్ లో అవకాశాలు దక్కలేదు. ఈ క్రమంలో నితిన్, సమంత కలిసి నటించిన అఆ సినిమాలో హీరో చెల్లెలుగా నటించి మెప్పించింది.
తర్వాత తెలుగులో పెద్దగా కనిపించకపోయినా.. తమిళ్, మలయాళ భాషల్లో కొన్ని సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని ప్రేక్షకులను మెప్పించింది. ఇక గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న అనన్య.. చైల్డ్ ఆర్టిస్ట్ గాను పలు సినిమాల్లో నటించి మెప్పించింది. 2008లో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. ఇండస్ట్రీ లోకి రాకముందు విలువిద్యలో ప్రావీణ్యత పొందింది. 2006, 2007లో రాష్ట్ర ,జాతీయస్థాయిలో ఛాంపియన్షిప్ ను రెండు సార్లు సాధించింది. ఇక ఈ అమ్మడుకు మోటార్ సైకిల్ రేసింగ్ అంటే ఎంతో ఇంట్రెస్ట్ అని టాక్. అనన్య బుల్లెట్ మోటార్ సైకిల్ నడపడంలో ప్రావిణ్యత పొందింది. ఇక ప్రస్తుతం అనన్యకు సంబంధించిన ఈ వార్తలు నెటింట వైరల్ అవ్వడంతో పాటు.. ఆమె చైల్డ్ హుడ్ ఫోటో కూడా నెటింట తెగ చక్కర్లు కొడుతుంది.