పిక్నిక్ కి వెళ్లి.. స్టార్ హీరోయిన్గా.. లయ అసలు స్టోరీ ఇదే..!

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా రాణించిన లయ‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికీ లయ ఎంతో మంది ఫేవరెట్ హీరోయిన్గా వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. స్వయంవరం, ప్రేమించు, హనుమాన్ జంక్షన్, నీ ప్రేమకై లాంటి ఎన్నో సినిమాలతో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఈ అమ్మడు.. సినీ కెరీర్ ఎలా ప్రారంభించిందో.. అసలు సినిమా ఛాన్స్ ఎలా వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. పిక్నిక్ లో చూసి ఈ అమ్మడిని మొదటి సినిమాల్లో తీసుకున్నారు. చిన్నతనంలో ఈ ముద్దుగుమ్మకు సినిమాల్లో నటించాలని కోరిక లేదట. కానీ.. ఆమెనే ఆఫర్ వెతుక్కుంటూ వచ్చింది. వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం ఎందుకని మంచిగా సద్వినియోగం చేసుకుంది. చివరికి స్టార్ హీరోయిన్గా టాలీవుడ్ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది.

Did you know actress Laya rejected a role in 'Aravindha Sametha Veera  Raghava'? | Telugu Movie News - Times of India

1981 లో అక్టోబర్ 21న విజయవాడలో ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన లయ.. అక్కడే తను చదువును పూర్తి చేసుకుంది. తల్లి నిర్మల హైస్కూల్లో మ్యూజిక్ టీచర్. ఇక తండ్రి ఓ డాక్టర్ కావడం విశేషం. అయితే చిన్నతనం నుంచే లయ ఎంత యాక్టివ్ గా ఉంటూ అందరి ప్రశంసలు అందుకునేది. స్టేట్ లెవెల్లో చెస్ ప్లేయర్ గా నిలిచింది. తర్వాత హైదరాబాద్ వెళ్లి క్లాసికల్ డ్యాన్సర్‌గా ఎన్నో స్టేజ్ పెర్ఫార్మన్స్ లు ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఓ రోజు తన తల్లి స్కూల్ తరఫున పిక్నిక్ పెట్టగా.. ఈ పిక్నిక్ కి అందరితో కలిసి ఎంత సరదాగా ఆడుకుంటుంటూ అల్లరి చేస్తుందట. ఈ క్రమంలో ఎనర్జీగా ఉన్న లయన్ చూసి దర్శకుడు అక్కినేని కుటుంబరావు.. ఆమెతో మూవీ తీయాలని భావించారు. అయితే ఈ మూవీకి లయ కరెక్ట్ గా సూట్ అవుతుందని ఫిక్స్ అయిన ఆయన.. అయ మంచి డ్యాన్సర్ అనితెలియ‌డంతో ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇస్తుందని క్లారిటీకి వచ్చారు.

Beautiful Actress Laya In Tradional Saree

ఆమెకు సినిమా ఆఫర్ ఇస్తానని చెప్పగానే తల్లి ఫుల్ ఖుషి అయిపోయిందట. అలా ల‌యా మూవీలో చేయడానికి సిగ్నల్ ఇచ్చింది. అలా లయతో సినిమా మొదలుపెట్టారు. దాని పేరే భద్రం కొడకో. ఈ సినిమాల్లో అర్బన్ ఏరియాస్ లో చిన్న పిల్లలు, పేద పిల్లలు, చైల్డ్ లేబర్ కి ఎలా గురవుతున్నారో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇందులో లయ చాలా బాగా నటించి మెప్పించింది. పెద్దయిన తర్వాత ఆమె స్వయంవరం సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ అమ్మ‌డు నటించిన చాలా సినిమాలు ప్రేక్షకులను భారీ లెవెల్లో ఆకట్టుకున్నాయి. అయితే ప్రస్తుతం లయ హీరోయిన్గా పరిచయం అవ్వడానికి వెనుక స్టోరీ తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఏంటి పిక్నిక్‌కు వెళ్లి సినిమాలో ఛాన్స్ కొట్టేసి అంచలంచలుగా స్టార్ హీరోయిన్గా మారిందా అంటూ నోరెళ్ళబెడుతున్నారు.