టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. నటుడు వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన సినిమాల్లో చెప్పవే చిరుగాలి సినిమా ఒకటి. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా.. అప్పట్లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో హీరో వేణుని ప్రేమించిన అమ్మాయిగా యాక్టర్ అభిరామి నటించింది. ఇక ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా తర్వాత తెలుగులో పెద్దగా కనిపించలేదు. కానీ తమిళంలో మాత్రం వరుస సినిమాలో నటించి లక్షలాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. అభిరామి 2001లో అర్జున్ నటించిన వానవిల్ మూవీ తో ఇండస్ట్రీకి పరిచయమైంది. తర్వాత పలు సినిమాల్లో నటించిన ఈ అమ్మడికి ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందలేదు.
దీంతో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కొన్ని సంవత్సరాలు నటించిన తర్వాత కమల్ హాసన్ నటించిన విశ్వరూపం సినిమాతో ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా అభిరామి తన ఇన్‌స్టా వేదికగా వీడియోని షేర్ చేస్తూ అందులో 24 ఏళ్లుగా తన మేకప్‌మెన్‌గా పని చేస్తున్న ప్రసాద్‌ను ఫ్యాన్స్‌కు పరిచయం చేసింది. నాతో 24 ఏళ్లుగా పనిచేస్తున్న ప్రసాద్ కి తమిళ్లో నా అనే అక్షరం ఎలా పలకాలో తెలియదు అంటూ ఓ వీడియోను షేర్ చేసుకుంది. నేను చాలా సార్లు ప్రయత్నించా కానీ అక్షరాన్ని సరిగ్గా అతనితో పలికించలేకపోయా.. అంటూ వివరించింది. తర్వాత అతను తన నాలుకను ఫోల్డ్ చేసి జా అనే అక్షరాన్ని ఎలా పలకాలో నేర్పిస్తున్నట్లు వీడియోను షేర్ చేసుకుంది. దాన్ని చూసి ఎంతో మంది ఆమె ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నారు.
అయితే కొందరు మాత్రం కావాలనే అతని అవమానించినట్లుగా ఆమె వీడియోను షేర్ చేస్తుందని కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారి కామెంట్స్ పై అభిరామి తనదైన స్టైల్ లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. నువ్వు కెమెరాలో మాట్లాడుతుంటే అసలు అందంగా లేవ్ ఆంటీ మేడం అంటూ.. ఎవరో కామెంట్ చేయగా.. దానిపై ఆమె రియాక్ట్ అవుతూ.. అప్పుడు చూడకు అని కౌంటర్ ఇచ్చింది. ఇంకొకరు నటన మానేశారా.. మేకప్ వేసుకోవడం తెలియడం లేదా అంటూ నెగిటివ్ కామెంట్ చేశారు. దానిపై నేను అతని వృత్తిపై ఎందుకు దుమ్మెత్తి పోస్తాను అంటూ రిప్లై ఇచ్చింది. ఇలా అభిరామి వరుసగా నెటిజన్ల కామెంట్లకు రిప్లై ఇవ్వడంతో.. కౌంటర్లు ఇస్తుంది మీరేనా.. మీ అడ్మిన్ కాదా.. అంటూ మరొకరు కామెంట్ చేశారు. నాకు టైం దొరికినప్పుడు అలా రిప్లై ఇస్తూ ఉంటా అంటూ వివరించింది. ప్రస్తుతం అభిరామి చేసిన ఈ కామెంట్స్ తో పాటు ఆమె వీడియో కూడా నెట్టింట తెగ వైరల్ గా మారుతుంది.