స్టార్ హీరోయిన్ రష్మిక మందన.. సినీ ఇండస్ట్రీలో భారీ క్రేజ్ సంపాదించుకొని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలో అమ్మడు ఏం చేసినా అది నెటింట సంచలనగా మారుతూ ఉంటుంది. మొదట కన్నడ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా మంచి సక్సస్ అందుకోవడంతో వరస అవకాశాలు క్యూ కట్టాయి. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకుంది.
తెలుగు తో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక అమ్మడి నుంచి చివరిగా వచ్చిన యానిమల్‌తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఈ అమ్మడు.. గతంలో బన్నీ.. పుష్ప తో నేషనల్ క్రష్ ఇమేజ్ దక్కించుకుంది. అయితే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న రష్మిక.. మరో పక్క సోషల్ మీడియాలను యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ అభిమానులతో షేర్ చేసుకుంటుంది.
ఇక తాజాగా రష్మిక తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఓ పోస్ట్ నెటింట వైరల్‌గా మారాయి. నా జీవితంలోకి వచ్చినందుకు చాలా థాంక్స్ అంటూ అమ్మడు.. ఓ పోస్ట్‌ను షేర్ చేసుకుంది. అయితే ఈ న్యూస్ నెటింట వైరల్ అవ్వడంతో.. ఈమె విజయ్ దేవరకొండను ఉద్దేశించే ఈ పోస్ట్ షేర్ చేసిందంటూ గుసగుసలు మొదలుపెట్టారు ఫ్యాన్స్. గత కొంతకాలంగా వీరిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రష్మిక చేసిన పోస్ట్ నెటింట హాట్ టాపిక్గా ట్రెండ్ అవుతుంది.