సమీరా రెడ్డి పిల్లలకు నచ్చిన ఎన్టీఆర్ సాంగ్ ఏదో తెలుసా..?

ఒకప్పటి టాలీవుడ్ క్రేజీ బ్యూటీ సమీరా రెడ్డికి తెలుగు ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు తెలుగులో నటించింది కేవలం మూడు సినిమాలు అయినా.. తన గ్లామర్ షోతో యూత్ ను బీభత్సంగా ఆకట్టుకుంది. ఇప్పటికీ అమ్మడికి సోషల్ మీడియాలో ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్‌తో నరసింహుడు, అశోక్ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ చిరంజీవితో జై చిరంజీవ సినిమాలను నటించింది. అయితే ఎన్టీఆర్ తో నటించే సమయంలో తారక్్‌తో సమీరా లవ్ ట్రాక్ నడిపిందంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి.

తారక్ కూడా ఆమెను ప్రేమించారని.. ఇద్దరి లవ్‌కు తారక్ ఫ్యామిలీ నో చెప్పడంతో వీరిద్దరికీ బ్రేకప్ అయిందని వార్తలు తెగ్గ చెక్కర్లు కొట్టాయి. ఇక 2024లో ఓ బిజినెస్ మ్యాన్‌ను వివాహం చేసుకొన్న స‌మీరా ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం ఈమెకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఇక అప్పట్లో ఇండస్ట్రీకి దూరమైనా ఈ ముద్దుగుమ్మ చాలా కాలం తర్వాత మొట్టమొదటిసారి తెలుగు మీడియాతో ముచ్చడించింది. తెలుగులో తన వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి అభిమానులతో షేర్ చేసుకుంటూ.. చిరంజీవి, ఎన్టీఆర్ లతో కలిసి నటించడం చాలా గొప్ప అనుభూతని.. వాళ్లతో నటించడం వల్ల నాన్న నాకంటే ఎక్కువగా ఆనందపడతారని.. నాకు చాలా గర్వంగా ఉంటుంద‌ని వివరించింది.

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పై ప్రశంసలు వర్షం కురిపించిన సమీరా.. ఎన్టీఆర్ ఎదిగిన తీరను.. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో తార‌క్‌కు ఇమేజ్ రావడం నాకు చాలా ఆనందంగా ఉందంటూ వివరించింది. ఈ క్రమంలో ఆయ‌న‌పై ఉన్న తన స్పెషల్ ఇంట్రెస్ట్ ని చూపిస్తూ.. తన పాటలంటే నాకు చాలా ఇష్టమని.. నాతో పాటు నా పిల్లలు కూడా ఆ పాటలను ఎంజాయ్ చేస్తారు.. ఎన్టీఆర్ ఆర్‌ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు.. వాళ్ళు చాలా ఇష్టంగా డ్యాన్స్ స్టెప్స్ కూడా వేస్తుంటారని వివరించింది. ఇక అశోక్ సినిమాలో పాటలన్నీ తన ఫేవరెట్ సాంగ్స్ అంటూ చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం సమీరా చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి.