తనను స్టార్ హీరోగా చేసిన డైరెక్టర్‌నే చిరంజీవి ఘోరంగా అవమానించాడా..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో చిరంజీవి గత నాలుగు దశాబ్దాలుగా మెగాస్టార్‌గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. తను నటించే ప్రతి సినిమాతోను ప్రేక్షకులను ఆకట్టుకునే చిరంజీవి.. ఇండస్ట్రీలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు పెద్దగా వ్యవహరిస్తూ ఎందరికో సహాయం చేస్తూ ఉంటాడు. అలా చిరంజీవికి టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో.. ఎంత మంచి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేప‌ద్యంలో చిరంజీవికి సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ నెటింట వైరల్‌గా మారింది. చిరంజీవిని స్టార్ హీరోగా మార్చిన ఓ దర్శకుడిని ఆయన బాధ పెట్టారని.. అవమానించారంటూ వార్తలు వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు..? చిరంజీవి ఆయన్ని అవమానించడం ఏంటో..? ఒకసారి తెలుసుకుందాం.

ఖైదీ దర్శకుడు కోదండరామిరెడ్డి, చిరంజీవి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్స్ మూవీస్ ఇవే.. – News18 తెలుగు

సినీ ఇండస్ట్రీలో ఎంత స్టార్ డైరెక్టర్స్ అయినా ఏదో ఒక సమయంలో కచ్చితంగా ప్లాపును చూడాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న స్టార్ డైరెక్టర్స్ అంతా కొన్నేళ్లు సమయం తీసుకునే సినిమాలను తెర‌కెక్కిస్తున్నారు. కానీ గతంలో అతి తక్కువ సమయంలోనే డైరెక్టర్లు వరుస సినిమాలను తీసేవారు. ఫోకస్ లేకపోవడంతో అప్పట్లో సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉండేది. కానీ ఒక్క డైరెక్టర్ మాత్రం చేసిన 94 సినిమాల్లో దాదాపు 80 సినిమాలతో సూపర్ హిట్ సాధించి స్టార్ డైరెక్టర్గా ఓ వెలుగు వెలిగాడు. ఇంతకీ ఆ డైరెక్టర్ మరెవరో కాదు.. కోదండరామిరెడ్డి. మెగాస్టార్ తో కోదండరామిరెడ్డి చాలా సినిమాలను తెరకెక్కించాడు. సంధ్య సినిమాతో కెరీర్ ప్రారంభించిన కోదండరామిరెడ్డి.. న్యాయం కావాలి సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఇక సినిమా చిరంజీవి కెరీర్ లోనే ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాగా నిలిచింది. ఈ సినిమా త‌ర్వాత‌ మొత్తం 23 సినిమాలు వీరి కాంబోలో రిలీజై మంచి సక్సెస్ అందుకున్నాయి.

ఇక 1993లో రిలీజ్ అయిన ముఠామేస్త్రి వీరిద్దరి కాంబోలో వ‌చ్చిన‌ చివరి సినిమా. అంటే దాదాపు మూడు దశాబ్దాల నుంచి వీరిద్దరికి కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కలేదు. ఇలాంటి క్రమంలో చిరంజీవి రీసెంట్ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. మెగాస్టార్ ఎద‌గడానికి కారకులైన దర్శకుల గురించి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరిని ప్రస్తావించి ప్ర‌సంసించాడు. అయితే కోదండరామిరెడ్డి పేరును మాత్రం ఆయన కనీసం ఎత్తలేదు. ఒక్క సినిమాతో మెగాస్టార్‌కు సక్సెస్ అందించిన దర్శకుల పేర్లను కూడా చెప్పిన చిరంజీవి.. కోదండరామిరెడ్డి పేరును చెప్పకపోవడం మెగా అభిమానులను కూడా ఆశ్చర్యపరిచింది. ఒక విధంగా చిరంజీవి స్టార్ హీరోగా మారడానికి కోదండరామిరెడ్డినే ప్రధాన కారణం. అయితే చిరు ఆయన గురించి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీనివల్ల తాను చాలా బాధపడ్డాను అని కోదండరామిరెడ్డి తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆయనకు, చిరంజీవికి మధ్యన ఎలాంటి మనస్పర్ధలు లేవని.. కానీ చిరంజీవి ఎందుకు తన పేరును ప్రస్తావించడానికి కూడా ఇష్టపడలేదో అర్థం కాలేదు అంటూ.. చాలా బాధపడ్డాను అని వివరించాడు.