ఆర్ సి 16 పై విజయ్ సేతుపతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. స్టోరీ ఇదే.. పక్కా బ్లాక్ బస్టర్ అంటూ..?!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో ఇమేజ్‌ క్రియేట్ చేసుకుని.. గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు చరణ్. ఈ సినిమా మరో నాలుగు రోజుల్లో షూటింగ్ పూర్తికానుంది. ఈ క్రమంలో చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా గ్రాండ్ లెవెల్లో జరిగాయి. దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఈ సినిమాల్లో చరణ్ జంటగా నటిస్తోంది. ఈ క్రమంలో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెల‌కొన్నాయి.

Vijay Sethupathi Superb Words About Ram Charan and Buchi Babu Movie | #RC16

సినిమా సెట్స్‌ పైకి రాకముందే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి.. చరణ్, బుచ్చిబాబు కాంబో సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా క‌థ నాకు తెలుసు.. ఖచ్చితంగా బ్లాక్ బ‌స్టర్ హిట్ అవుతుందంటూ ఆయన వివరించాడు. విజయ్ సేతుపతి కామెంట్స్‌తో చరణ్ అభిమానుల్లో మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇక చిరంజీవి శ్రీదేవి కాంబో అప్పట్లో ఎంత పెద్ద హిట్ కాంబోనో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చరణ్, జాన్వి కాంబినేషన్ కూడా ఇదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తుందంటూ అభిమానులు భావిస్తున్నారు. ఒకింత భారీ బడ్జెట్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకి పెద్ది అనే టైటిల్ ఫిక్స్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

Vijay Sethupathi lauds Buchi Babu Sana for his next film with Ram Charan;  says movie has a 'superb story' | PINKVILLA

స్పోర్ట్స్ విలేజ్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు మైత్రి మూవీ, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌ పైకి రానిందని టాక్. గేమ్ చేంజర్‌ షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఆర్సి 16 షూటింగ్లో పాల్గొని సందడి చేయనున్నాడని తెలుస్తుంది. అలాగే బుచ్చిబాబు కూడా గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఉన్న రామ్ చరణ్‌ సినిమా కావడంతో మరింత శ్రద్ధ వహిస్తున్నాడని సమాచారం. ఇక ఆర్‌ఆర్ఆర్ తర్వాత చరణ్ నుంచి ఒక్క సోలో సినిమా కూడా రాక‌పోవడంతో చరణ్ నుంచి రాబోయే అన్ని సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలనుకున్నాయి. ఈ సినిమాలో రిలీజై ఆడియన్స్ లో ఎలాంటి రిజల్ట్ సంపాదించుకుంటాయో చూడాలి.