తాప్సి తెలుగు సినిమాలలో నటించకపోవడానికి కారణం అదేనా ..? ఇక జన్మలో ఇటువైపు చూడదా..?

చాలామంది హీరోయిన్స్ తెలుగు ఇండస్ట్రీ ద్వారానే పాపులారిటీ సంపాదించుకొని .. ఆ తర్వాత కోలీవుడ్ – బాలీవుడ్ ఇండస్ట్రీలలోకి వెళ్లిపోతున్నారు . ఆ లిస్టులోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ పంజాబీ బ్యూటీ తాప్సీ పన్ను. మంచు మనోజ్ నటించిన ఝుమ్మంది నాదం అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో నటించి మెప్పించింది . మంచి హీరోయిన్గా పాపులారిటీ దక్కించుకుంది .

ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళింది . అక్కడ బోల్డ్ బ్యూటీ అంటూ ట్యాగ్ చేయించుకుంది . అయితే బాలీవుడ్లో ఆఫర్స్ వచ్చాక టాలీవుడ్ ఇండస్ట్రీని పట్టించుకోవడమే మానేసింది అన్న కామెంట్స్ వినిపించాయి . అయితే ఒకానొక ఇంటర్వ్యూలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే హీరోలపై తాప్సి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి . తెలుగులో కేవలం హీరోలకు మాత్రమే ప్రాధాన్యత ఉన్న పాత్రను ఇస్తారు అని.. హీరోయిన్స్ అంటే కేవలం గ్లామర్ డాల్ గానే చూస్తారు అని..

అలాంటి సినిమాలో నటించిన పెద్దగా యూస్ ఉండదు అని .. అందుకే సినిమాలకు అందుకే తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్నాను అని చెప్పకనే చెప్పేసింది . ఈ విషయాన్ని మరొకసారి అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే మాత్రం ఇక తాప్సీ ని తెలుగుతరపై చూడడం జరగదు అని అంటున్నారు అభిమానులు. ప్రజెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో బడా బడా ఆఫర్లతో ముందుకు వెళ్తుంది తాప్సి..!!