ఆ విషయంలో చిరంజీవి-బాలకృష్ణను ఫాలో అవుతున్న వెంకటేష్ .. ఇన్నాళ్లకు మంచి నిర్ణయం తీసుకున్నాడుగా..!

ఎవరైనా సరే ఒక మంచి పని చేస్తే ఆ మంచి పనిని ఆదర్శంగా తీసుకొని.. మనం కూడా మంచి చేయొచ్చు .. మనం కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు.. ఆ విషయంలో మనల్ని ఎవ్వరూ కూడా తప్పు పట్టరు ..అడ్డు చెప్పరు . అయితే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోస్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి – బాలకృష్ణ తమ కెరియర్లో తీసుకున్న మంచి నిర్ణయాలు ఆదర్శంగా తీసుకొని హీరో వెంకటేష్ కూడా అదే పని చేయబోతున్నాడు అన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది .

వెంకటేష్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . సీనియర్ హీరోగా ప్రజెంట్ తనదైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్తున్నాడు . కాగా రీసెంట్గా వెంకటేష్ తీసుకున్న ఒక నిర్ణయం అభిమానులకి ఫుల్ గూస్ బంప్స్ప్ తెప్పిస్తుంది . త్వరలోనే విక్టరీ వెంకటేష్ కూడా హోస్టుగా మారబోతున్నారట . గతంలో జూనియర్ ఎన్టీఆర్ – చిరంజీవి – బాలకృష్ణ ఏ విధంగా అయితే హోస్ట్ చేసి జనాలను మెప్పించారో అదేవిధంగా..ఇప్పుడు ఈ విక్టరీ వెంకటేష్ మారబోతున్నాడట.

వెంకటేష్ కూడా ఒక షోని హోస్ట్ చేయబోతున్నారట . అయితే ఆ షో కు సంబంధించిన డీటెయిల్స్ మాత్రం ఇంకా సీక్రెట్ గానే ఉంచుతున్నారు మేకర్స్. త్వరలోనే టెలికాస్ట్ కాబోతున్న ఒక షో కోసం విక్టరీ వెంకటేష్ ను హోస్ట్ గా మార్చబోతున్నారట . ప్రముఖ ఛానల్ భారీ రెమ్యూనరేషన్ కూడా ఇవ్వడానికి సిద్ధమైయ్యారట. దీనికి సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!