12 మంది టాలీవుడ్ హీరోలు రిజెక్ట్ చేసిన సినిమాని ఓకే చేసి ..బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న రియల్ స్టార్ ఇతడే..!

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన కథను మరొక హీరో చేస్తూ ఉండడం చాలా చాలా కామన్ థింగ్ అన్న విషయం అందరికీ తెలుసు . అయితే ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమాలు మరొక హీరో రిజెక్ట్ చేయడం మరొక హీరో రిజెక్ట్ చేయడం అలా నలుగురు ఐదుగురు హీరోస్ రిజెక్ట్ చేసిన తర్వాత ఇంకొక స్టార్ ఆ సినిమాను చేసి హిట్ కొట్టడం చాలా చాలా రేర్ గా జరుగుతూ ఉంటుంది . అయితే ఒకే సినిమా కాదు ను ఏకంగా 12 మంది హీరోలు రిజెక్ట్ చేస్తే.. అది కూడా ఒకే ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు ఆ సినిమా కథను ఒకే కారణంతో వద్దు అని చెప్తే.. ఆ తర్వాత ఆ హీరో ఆ కథను చూస్ చేసుకునే హీరో పై ఎంత ప్రెజర్ ఉంటుందో అందరికీ తెలిసిందే.

అటువంటి సిచువేషన్ లో కూడా ఆ సినిమా హిట్ అయితే అది నిజంగా చరిత్ర తిరగరాసిన సినిమానే చెప్పాలి . అలాంటి ఓ అరుదైన ఘనత అందుకున్నాడు సూర్య కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సూర్య . ఈయన గురించి మనం ఎంత మాట్లాడుకున్న తక్కువే హీరో సూర్య స్టైలే వేరు . యంగ్ ఏజ్ లో చాలా లవ్ రొమాంటిక్ సినిమాలలో నటించి సీనియర్ ఏజ్ రాగానే తనకంటూ కొన్ని లిమిట్స్ పెట్టుకొని మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ లోనే కనిపిస్తున్నాడు.

కాగా సూర్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా గజిని . మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఈ సినిమాను మురుగదాస్ చాలామంది హీరోలకి ఎక్స్ప్లైన్ చేశారట. టాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ఆల్మోస్ట్ అందరి బడా స్టార్ హీరోస్ కి ఈ కథను ఎక్స్ప్లెయిన్ చేశాడట. అయితే ఈ కథను చేయడానికి ఏ హీరో కూడా సాహసం చేయకపోవడం గమనార్హం . అందరూ కూడా ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ అని జనాలకు నచ్చకపోతే భారీ డిజాస్టర్ తప్పదు అన్న భయంతో రిజెక్ట్ చేసారట . ఫైనల్లీ సూర్య ఓకే చేసి సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు..!