“కల్కి” సినిమా కోసం కృష్ణంరాజు ఫ్యామిలీ అలా చేయబోతుందా..? నాగ్ ఆశ్వీన్ ప్లాన్ మామూలుగా లేదుగా..!

ఈ మధ్యకాలంలో సినిమా ప్రమోషన్స్ కోసం ఏదైనా చేయడానికి డిసైడ్ అవుతున్నారు మేకర్స్ . మరీ ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ సైతం తన సినిమా ప్రమోషన్స్ కోసం జనాలలో హైప్ తీసుకురావడానికి తన పెళ్లిని వాడుకున్న విషయం అందరికీ తెలిసిందే . బుజ్జిని ఇంట్రడ్యూస్ చేయడానికి ఏకంగా తన లైఫ్ లోకి స్పెషల్ పర్సన్ రాబోతుంది అంటూ ఒక్క పోస్టుతో పాన్ ఇండియా లెవెల్ లో హైప్ క్రియేట్ చేశాడు ప్రభాస్.

ఆ తర్వాత ప్రభాస్ ని ఎంతమంది తిట్టుకున్నారో అందరికీ తెలిసిందే . అయితే ఇప్పుడు కల్కి సినిమా ప్రమోషన్స్ కోసం ఏకంగా కృష్ణం రాజు ఫ్యామిలీని రంగంలోకి దించబోతున్నాడు అన్న న్యూస్ వైరల్ గా మారింది . కృష్ణం రాజు ఫ్యామిలీ తో ప్రభాస్ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ని ఓకే చేశారట. ఈ ఇంటర్వ్యూలో కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి పలువురు అటెండ్ అవుతారట. ముఖ్యంగా ప్రభాస్ సిస్టర్స్ ప్రభాస్ పెద్దమ్మ ఈ ఇంటర్వ్యూలో హాజరు కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు ఇప్పటివరకు ఏ ఇంటర్వ్యూలో రివీల్ చేయని కొన్ని టాప్ సీక్రెట్స్ ని కూడా ఈ ఇంటర్వ్యూలో బయట పెట్టబోతున్నారట. ఇదంతా కేవలం నాగ్ అశ్వీన్ కల్కి సినిమా ప్రమోషన్స్ కోసం మాత్రమే చేస్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . ఈ వార్తలో ఎంత నిజం ఉంది అని తెలియనప్పటికీ సోషల్ మీడియాలో జెడ్ స్పీడ్ లో ట్రెండ్ అవుతుంది. ఈ సినిమా జూన్ 27 వ తేది ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది..!!