సమస్య ల్లో రకుల్ ప్రీత్ భర్త.. తనని మోసం చేశాడంటూ మహిళ తీవ్ర ఆరోపణలు.. ఏం జరిగిందంటే..?!

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల పరిచయం అవసరం లేదు. అయితే ఈ అమ్మడు తాజాగా ప్రియుడు జాకీ భ‌గ్నానిని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సినిమాలు చేస్తూనే మరో పక్కన ఫుడ్ బిజినెస్ ను స్టార్ట్ చేసి బిజీగా లైఫ్ లీడ్‌ చేస్తుంది. అలాగే భర్తతో వెకేషన్స్ ఎంజాయ్ చేస్తున్న ఈ అమ్మడు.. ఎప్పటికప్పుడు ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా రకుల్ భర్త జాకీ స‌మ‌స్య‌లో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమకు గ‌త రెండేళ్ళుగా జీతాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నారంటూ ఓ మహిళ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ షాకింగ్ విషయాలను రివల్ చేసింది. రకుల్ భర్త జాకీ భ‌గ్నానికి బాలీవుడ్ లో పూజ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో నిర్మాణ సంస్థ ఉన్న సంగతి తెలిసిందే.

Rakul Preet Singh and Jackky Bhagnani to delay their honeymoon and head  back to work after their wedding | - Times of India

దీని ద్వారా ఎన్నో సినిమాలను రూపొందించి.. కోట్ల లాభాలను అర్జిస్తున్న‌ జాకీ.. ఇటీవల బడే మియా చోటే మియా సినిమా ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇది డిజాస్టర్ కావడంతో నష్టాల్లో కూరుకుపోయినట్లు సమాచారం. దీంతో రెండు నెలల జీతాన్ని రెండు సంవత్సరాలుగా ఇవ్వట్లేదు అంటూ పూజ నిర్మాణ సంస్థ పై ఓ ఉద్యోగి షాకింగ్ పోస్ట్ ని షేర్ చేయడం ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అయితే బాలీవుడ్ రూల్స్ ప్రకారం 45 నుంచి 60 రోజుల్లో ఎలాంటి వారైనా ఉద్యోగులకు డబ్బులు ఇచ్చేయాలి. కానీ ఇప్పటివరకు తమకు జీతాలు ఇవ్వలేదంటూ వైష్ణవి అనే ఉద్యోగి త‌న ఆవేదనను నెటిజ‌న్ల‌తో షేర్ చేసుకుంది. నాతో పాటు 100 మందికి జీతాలు ఇవ్వడం లేదని.. గత రెండేళ్లుగా ఆ జీతాల కోసం ఎదురు చూస్తున్నాం అంటూ చెప్పుకొచ్చింది.

Pooja Entertainment - Wikipedia

ఇందులో నటులకు మాత్రం వెంటనే రెమ్యూనరేషన్ ఇచ్చారని.. రెక్కలు ముక్కలు చేసుకుని సినిమా కోసం పనిచేసిన మాకు మాత్రం మా జీతాలు ఇవ్వడం లేదని వివ‌రించింది. ఇంతకాలం భరించాం.. కానీ మా సొంత డబ్బు కోసం ఇప్పుడు వారి చేసినవి బయట పెట్టక తప్పడం లేదు.. ఫుడ్ కూడా సరిగ్గా పెట్టలేదు.. మా ప్రశ్నలకు నిర్మాత దగ్గర సమాధానం లేదు అంటూ చెప్పుకొచ్చింది. ఈ సంస్థలో మరి ఎవరు పని చేయొద్దని.. మీడియా ప్రతినిధులు మా సమస్యలను కవర్ చేయండి అంటూ వేడుకుంది. అలాగే సోషల్ మీడియాలో ఈ విషయాలను వైరల్ చేయండి అంటూ అవేద‌న వ్య‌క్తం చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్ అవ్వడంతో అంత ఆశ్చర్యపోతున్నారు. కోటీశ్వరుడైన జాకీ భగ్నాన్ని ఉద్యోగుల జీతాలను ఇవ్వకుండా బాధ పెట్టడం ఏంటి అంటూ ఫైర్ అవుతున్నారు. అసలు ఇందులో నిజమంతా తెలియాలంటే రకుల్ భర్త జాకీ స్పందించే వరకు వేచి చూడాల్సిందే.